Home /News /telangana /

CHOUTUPPAL FARMERS COMPLAINT AGAINST DIVIS LABORATORIES RAO MINISTER TALASANI SRINIVAS SK

రైతులపై దివీస్ కంపెనీ దౌర్జన్యం.. మంత్రి తలసానికి ఫిర్యాదు

మంత్రి తలసానికి వినతి పత్రం సమర్పిస్తున్న రైతులు

మంత్రి తలసానికి వినతి పత్రం సమర్పిస్తున్న రైతులు

దివీస్ కంపెనీ విద్యుత్ లైన్లను తమ పొలాల మీదుగా కాకుండా వేరే దారిలో మళ్లించేలా చర్యలు.. తమకు న్యాయం చేయాలని కోరారు. రైతుల విజ్ఞప్తిపై మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు.

    దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు చౌటుప్పల్ రైతులు ఫిర్యాదు చేశారు. తమ పొలాల మీదుగా అక్రమంగా హైటెన్షన్ విద్యుత్‌లైన్‌లు తీసుకెళ్తున్నారని, పొలాల్లో స్తంభాలు పాతేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పంటపొలాల మీదుగా హైటెన్షన్ విద్యుత్ తీగలు వెళ్తే మూగజీవాలతో పాటు తమకూ అనారోగ్య సమస్యలు వస్తాయని వాపోయారు. ఈ మేరకు శుక్రవారం మంత్రి తలసానిని కలిసి వినతీ పత్రం సమర్పించారు.

    రైతులు చెప్పిన వివరాల ప్రకారం... యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలో ఉన్న దివీస్ ల్యాబొరేటరీస్ కంపెనీ తమ ప్లాంట్ విస్తరణ పనులను చేపట్టింది. ఇందుకోసం చౌటుప్పల్ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి లింగోజిగూడెంలో ఉన్న కంపెనీ వరకు 132 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్లు వేస్తున్నారు. రహదారి వెంట విద్యుత్ లైన్ తీసుకెళ్తే ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయనే ఉద్దేశంతో.. రైతుల పొలాల మీదుగా విద్యుత్ లైన్లు వేస్తున్నారు. ఐతే భారీ హైటెన్షన్ విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేస్తే తమ పంట పొలాలు నాశనమవుతాయని చౌటుప్పల్‌కు చెందిన 30 రైతు కుటుంబాలు వాపోతున్నాయి.

    ఇప్పటికే దివీస్ కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాలతో భూమి, గాలి, భూగర్భ జలాలు కాలుష్యమవుతున్నాయని రైతులు చెప్పారు. ఇప్పుడు విద్యుత్ లైన్లు తీసుకొస్తే పంటపొలాలకు నష్టం వాటిల్లడంతో పాటు మూగజీవాలు, తమ ఆరోగ్యాలు కూడా పాడవుతాయని మంత్రి తలసానికి ఫిర్యాదు చేశారు. దివీస్ కంపెనీ విద్యుత్ లైన్లను తమ పొలాల మీదుగా కాకుండా వేరే దారిలో మళ్లించేలా చర్యలు.. తమకు న్యాయం చేయాలని కోరారు. రైతుల విజ్ఞప్తిపై మంత్రి తలసాని సానుకూలంగా స్పందించారు. సంబంధిత అధికారులతో పాటు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

    తలసానికి రైతులు ఇచ్చిన వినతీ పత్రం
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Talasani Srinivas Yadav, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు