జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్​స్టేషన్​గా చొప్పదండి

స్టేషన్లో కంప్లైంట్లు ఆన్​లైన్​ చేసే విధానం, రికార్డుల అప్​డేట్​, స్టేషన్ పరిసరాల్లో చేపడుతున్న గార్డెనింగ్ పనులు, దివ్యాంగులకు సౌకర్యాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, రిసెప్షన్​ కౌంటర్, సిబ్బంది నడవడిక, క్రైం జరిగిన వెంటనే డిటెక్ట్​ చేసిన విధానాల ఆధారంగా చొప్పదండిని ఎంపిక చేశారు.

news18-telugu
Updated: December 6, 2019, 9:03 PM IST
జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్​స్టేషన్​గా చొప్పదండి
చొప్పదండి పోలీస్ స్టేషన్
  • Share this:
దేశంలోని ఉత్తమ పోలీస్​స్టేషన్ల జాబితాలో చొప్పదండి టాప్​ 8వ స్థానంలో నిలిచింది. కేంద్ర హోంశాఖ విడుదల చేసిన జాబితాలో ఉత్తమ పోలీసింగ్ విధానాలతో ప్రజలకు మెరుగైన సేవలను అందించడం ద్వారా చొప్పదండి స్టేషన్ ఉత్తమ పోలిస్ స్టేషన్ గా నిలిచింది. దేశంలో 15,660 పోలీస్ స్టేషన్లు ఉండగా వాటిలో ఉత్తమ పోలీస్​స్టేషన్ల ఎంపికను కేంద్ర హోంశాఖ చేపట్టింది. అందులో 77 స్టేషన్లు షార్ట్​ లిస్ట్​ చేసి టాప్​టెన్​ స్టేషన్ల ఎంపిక కోసం కేంద్ర హోంశాఖ సర్వే నిర్వహించింది. స్టేషన్లో కంప్లైంట్లు ఆన్​లైన్​ చేసే విధానం, రికార్డుల అప్​డేట్​, స్టేషన్ పరిసరాల్లో చేపడుతున్న గార్డెనింగ్ పనులు, దివ్యాంగులకు సౌకర్యాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్, రిసెప్షన్​ కౌంటర్, సిబ్బంది నడవడిక, క్రైం జరిగిన వెంటనే డిటెక్ట్​ చేసిన విధానాల ఆధారంగా చొప్పదండిని ఎంపిక చేశారు. జాతీయస్థాయిలో 10 ప్రధాన పోలీస్ స్టేషన్లలో ఒకటిగా నిలిచినందుకు చొప్పదండి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిబ్బందిని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డా.ఎం.మహేందర్ రెడ్డి అభినందించారు.
Published by: Krishna Adithya
First published: December 6, 2019, 9:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading