Home /News /telangana /

CHLORINE GAS LEAK IN SIRPUR ASIFABAD 20 LABOUR HOSPITALISED SK

సిర్పూర్ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్.. 20 మంది కార్మికులకు అస్వస్థత

అస్వస్థతకు గురైన కార్మికులు

అస్వస్థతకు గురైన కార్మికులు

పేపర్ 1, 2 ఫ్లాంట్లకు వెళుతున్న క్లోరిన్ లీకవడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.

    విశాఖలో స్టైరీన్ గ్యాస్ లీక్ ఘటన మరవక ముందే దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. తాజాగా కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం పేపర్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. సిఎల్ఓ 2 ఫ్లాట్ వద్ద ఉదయం 6:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గ్యాస్ లీకైంది. పేపర్ 1, 2 ఫ్లాంట్లకు వెళుతున్న క్లోరిన్ లీకవడంతో సమీపంలో విధులు నిర్వహిస్తున్న 20 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. బాయిలర్‌కు అత్యంత సమీపంలో క్లోరీన్ గ్యాస్ లీకవడంతో ఒక్కసారిగా కార్మికులు పరుగులు తీశారు. ఒక్కరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో హుటహుటిన సమీపంలోని‌ ఓ ప్రైవేటు ఆస్పత్రికి‌ తరలించారు. ప్రస్తుతం ఆ కార్మికుడి పరిస్థితి క్షేమంగానే ఉన్నట్టు సమాచారం. మరో ముగ్గురు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.

    క్లోరిన్ గాఢత తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటన పై స్పందించేందుకు జేకే పేపర్ మిల్ యాజమాన్యం నిరాకరించింది. లాక్ డౌన్ కావడంతో పూర్తి స్థాయిలో బాయిలర్స్ వినియోగంలో లేకపోవడం పేపర్ బ్రైట్ నెస్ పెంచేందుకు వినియోగించే క్లోరీన్ లిక్విడ్ ఉష్ణోగ్రత 15 డిగ్రీలు మించడంతో ఈ ఘటన జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. వెంటనే అప్రమత్తమైన సిర్పూర్ పేపర్ మిల్ జేకే యాజామాన్యం కార్మికులను అర్థాంతరంగా ఇంటికి పంపించింది. ఈ ఘటనతో పేపర్ మిల్లు పరిసరాల్లోని ప్రజల్లో భయాందోళన నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Asifabad, Gas leak, Telangana, Telangana News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు