తెలంగాణ గవర్నర్‌‌తో చిరంజీవి భేటీ వెనక ఉన్న రహస్య ఎజెండా ఇదేనా..

మెగాస్టార్ చిరంజీవి నిన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ వెనక అసలు కారణాలు ఇవే అంటూ వార్తలు వస్తున్నాయి.

news18-telugu
Updated: June 3, 2020, 10:14 AM IST
తెలంగాణ గవర్నర్‌‌తో చిరంజీవి భేటీ వెనక ఉన్న రహస్య ఎజెండా ఇదేనా..
గవర్నర్‌‌కు చిరంజీవి దంపతుల పుట్టినరోజు శుభాకాంక్షలు (Twitter/Photo)
  • Share this:
మెగాస్టార్ చిరంజీవి నిన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ను రాజ్‌భవన్‌లో కలిసి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకు ముందు చిరంజీవి సోషల్ మీడియా  వేదికగా తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన సంగతి తెలిసిందే కదా. దానికి తెలంగాణ గవర్నర్ కూడా చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు తెలంగాణ గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తన పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందంటూ చెప్పారు. ఐతే.. నిన్న సాయంతరం చిరంజీవి సతీ సమేతంగా గవర్నర్ దంపతులను కలిసి పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వయంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం సినీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

chiranjeevi met telangana governor Tamilisai Soundararajan due to this reasons,chiranjeevi,chiranjeevi twitter,chiranjeevi Met Tamilisai Soundararajan,chiranjeevi birthday wishes to governor Tamilisai Soundararajan,chiranjeevi telangana governor Tamilisai Soundararajan,chiranjeevi telangana chief minister kcr,chiranjeevi best wishes to telangana people,tollywood,telugu cinema,telangana politics,చిరంజీవి,తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం,తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చిరంజీవి శుభాకాంక్షలు,తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చిరంజీవి శుభాకాంక్షలు,తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్,తమిళపై సౌందరరాజన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి,తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన చిరంజీవి,తెలంగాణ గవర్నర్‌తో చిరంజీవి దంపతులు భేటి
గవర్నర్‌‌ దంపతులతో చిరంజీవి (Twitter/Photo)


ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్‌తో చిరంజీవి భేటి వెనక ఏదైనా రాజకీయా ఎజెండా ఉందా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చిరంజీవి.. అటు తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. చిరంజీవి నేతృత్వంలో టాలీవుడ్‌లో షూటింగ్స్ సంబంధించి చర్చలు జరిగాయి.  ఈ విషయమైన చిరంజీవి, బాలయ్య మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.  తాజాగా తెలంగాణ గవర్నర్‌తో చిరు భేటి వెనక కేంద్రంతో బీజేపీ పెద్దలతో సఖ్యత పెంచుకోవడానికే అన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు చెందిన జనసేన.. ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తున్న విషయం విదితమే కదా. ఈ రకంగా చిరంజీవి ఒకేసారి టీఆర్ఎస్, వైసీపీ, బీజేపీ పెద్దలతో టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో క్రియా శీలకంగా వ్యవహరించి.. కేంద్ర మంత్రిగా పనిచేసిన చిరంజీవి.. ఇపుడు తన అడుగులు మళ్లీ తన అడుగులను బీజేపీ వైపు వేయకపోయినా... కేంద్ర పెద్దలతో సఖ్యంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంగా రాజకీయంగా శతృశేషం లేకుండా చేసుకోవడం ఒకటైతే..  మరల ఇండస్ట్రీతో పాటు రాజకీయాల్లో అందరివాడు అనిపించుకునేలా చిరంజీవి అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: June 3, 2020, 8:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading