టాలీవుడ్ మెగాస్టార్(Tollywood megastar)చిరంజీవి(Chiranjeevi)బర్త్ డే వేడుకల్ని ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రక్తదాన శిభిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. తెలంగాణ(Telangana)లోని జోగులాంబ గద్వాల్(Jogulamba Gadwal)జిల్లా కేంద్రానికి కొందరు అభిమానులు బిగ్‌బాస్‌పై ఉన్న తమ అభిమానాన్ని వినూత్నరీతిలో తెలియజేశారు. సుప్రీం హీరోకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చిరంజీవి ఫోటో అభిమానం గుండెల్లోనే కాదు ఎక్కడైనా ముద్రపడిపోతుందని నిరూపించారు. చిరు ఫ్యాన్స్ ఇచ్చిన ఆ మెగా పిక్చరే వైరల్(Viral)అవుతోంది.
మెగా పిక్చర్ ..
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ బిగ్‌బాస్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. 150సినిమాలకుపైగా యాక్ట్ చేసి..కోట్లాది మంది ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానం చోటు దక్కించుకున్న సుప్రీం హీరోకి పుట్టిన రోజు ఆగస్ట్ 22వ తేది కావడంతో అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రానికి చెందిన తొమ్మిది మంది స్నేహితులు కలిసి మెగాస్టార్ ఫోటోను భారీ సైజులో నేలపై వేసి అందర్ని ఆకట్టుకుంటున్నారు. గద్వాల్ పట్టణం రైచూర్ రోడ్డులోని నోబెల్ స్కూల్ సమీపంలో రోడ్డుపై మెగాస్టార్ చిరంజీవి ఫోటోను గీశారు అభిమానులు. 30క్వింటాళ్ల ఉప్పు, లవంగాలతో ఈ అద్బుతమైన చిత్రాన్ని గీశారు. 400ఫీట్ల పొడవు, 250ఫీట్ల వెడల్పు కలిగిన చిరంజీవి ఫోటోను వేసి ..జన్మదిన శుభకాంక్షలు తెలియజేశారు.
ఫ్యాన్స్ కళాకృతి..
సినిమాల్లోని చిరంజీవి నటన, డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అలాగే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తూ ఎంతో మందికి స్వచ్చంద సేవ చేస్తున్నారు. అందుకే తమ అభిమాన నటుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా ఉండాలని కోరుతూ గద్వాల్‌కి చెందిన మురళి, రఘు, అయ్యప్ప, పరుశ, రఘు, రంగస్వామి, మధు, రవి అనే 9మంది అభిమానులు ఈవిధంగా మెగాస్టార్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
అప్పుడు చెర్రి ఫోటో..ఇప్పుడు చిరు ఫోటో..
రీసెంట్గా చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డేకి ఇదే జిల్లాకు చెందిన మెగాఅభిమాని ఒకరు నారుమడితో రామ్‌చరణ్ చిత్రాన్ని తయారు చేసి అందర్ని ఆకర్షించాడు. ఇప్పుడు మెగాస్టార్ ఫోటో చిత్రీకరించి మరోసారి మెగాఫ్యాన్స్ బర్త్ డే జోష్‌లో నింపారు గద్వాల్ చిరు అభిమానులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.