• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • CHINESE HACKERS TRY TO ATTACK TELANGANA POWER DEPARTMENT SERVERS BA

తెలంగాణను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు.. ఆ శాఖ సర్వర్లలోకి చొరబడే ప్రయత్నం

తెలంగాణను టార్గెట్ చేసిన చైనా హ్యాకర్లు.. ఆ శాఖ సర్వర్లలోకి చొరబడే ప్రయత్నం

ప్రతీకాత్మక చిత్రం

భారత్ మీద చైనా హ్యాకర్లు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న సీరం ఇన్ స్టిట్యూట్‌ను, పవర్ గ్రిడ్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు ఈ సారి తెలంగాణను లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణలోని విద్యుత్ శాఖ వెబ్ సైట్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు.

 • Share this:
  భారత్ మీద చైనా హ్యాకర్లు దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిన్న సీరం ఇన్ స్టిట్యూట్‌ను, పవర్ గ్రిడ్‌ను టార్గెట్ చేసిన హ్యాకర్లు ఈ సారి తెలంగాణను లక్ష్యంగా చేసుకున్నారు. తెలంగాణలోని విద్యుత్ శాఖ వెబ్ సైట్‌ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో తెలంగాణ విద్యుత్ శాఖను కంప్యూటర్ ఎమర్జెన్సీ సిస్టమ్ హెచ్చరిక వచ్చింది. చైనాకు చెందిన కొందరు హ్యాకర్లు తెలంగాణ స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్, తెలంగాణ ట్రాన్స్ కో సర్వర్లను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుని లాక్ ఇన్ సర్వర్లు, కంట్రోల్ ఫంక్షన్స్ గమనిస్తూ ఉండాలని సూచించింది. దీంతో విద్యుత్ శాఖ అప్రమత్తమైంది. వెబ్ సైట్‌లో ఉన్న అందరి యూజర్ ఐడీలు, పాస్ వర్డ్‌లు మార్చేసింది. చైనా హ్యాకర్ల విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు చెప్పారు.

  గతంలోనూ సైబర్ ఎటాక్ 

  2020 మేలో భారత్ లోని 12 రాష్ట్రాల్లో పవర్ సప్లై, ఎలక్ట్రిసిటీ లోడ్ చేసే NTPC లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లోని కంప్యూటర్ నెట్‌వర్కులకు టెక్నికల్ సమస్య వచ్చింది. అలా ఎందుకు జరిగిందో వెంటనే తెలియలేదు. లోతుగా విశ్లేషించగా తాజాగా అసలు విషయం తెలిసింది. చైనా ప్రభుత్వ సపోర్టుతో రెచ్చిపోతున్న హ్యాకర్ గ్యాంగులు... ఓ మాల్వేర్ కంప్యూటర్లలోకి పంపినట్లు తాజా అధ్యయనంలో తేలింది.

  అమెరికాకి చెందిన కంపెనీ రికార్డెడ్ ఫ్యూచర్... ఈ అధ్యయనం జరిపింది. ఈ సంస్థ... మన దేశంలోని NTPC, ఇతరత్రా ఎలక్ట్రిసిటీ సంబంధిత సంస్థల ఇంటర్నెట్ వ్యవస్థల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎలక్ట్రిసిటీ సప్లై సరిగా జరిగేలా... సప్లైకి సరిపడా డిమాండ్... డిమాండ్‌కి సరిపడా సప్లై ఉండేలా చేస్తుంది. ఐతే... పవర్ సప్లై సంస్థలపై హ్యాకింగ్ దాడులు జరగడం అప్పట్లో కలకలం రేపింది. హ్యాకర్లు దాడి చేసేంత ఈజీగా మన పవర్ సప్లై సంస్థలు ఎందుకున్నాయన్న ప్రశ్న వచ్చింది. ఇండియన్ నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (NCIIPC) ప్రకారం... 12 సంస్థల్లో మౌలిక వసతులు సరిగా లేవు. అంటే అవి హ్యాకర్ల దాడుల్ని ఆపేలా లేవని అర్థం. అంటే వాటిలో మరింత హై సెక్టూరిటీ ఫీచర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నట్లే.

  2020 అక్టోబర్ 13 ముంబైలో పెద్ద ఎత్తున కరెంటు పోయింది. ఏకంగా సగం ముంబై అంధకారంలోకి వెళ్లిపోయింది. అప్పుడు పద్ఘాలోని కరెంటు లోడ్ పంపే కేంద్రంలో ఓ మాల్వేర్‌ను గుర్తించారు. అది కూడా చైనా పనే అంటున్నారు. గతేడాది జూన్‌లో భారత్, చైనా సైనికుల మధ్య లఢక్‌ సరిహద్దులోని తూర్పు గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగింది. ఇలా ఇండియా ఎదుగుదలను ఓర్వలేకపోతున్న చైనా రకరకాలుగా దెబ్బ తీసేందుకు యత్నిస్తోంది. అంతెందుకు... ప్రస్తుతం ఇంటర్నెట్‌లో కలర్స్ గేమ్ అనే బెట్టింగ్ గేమ్ నడుస్తోంది. అలాంటి గేమ్ వెబ్‌సైట్లు దాదాపు 50 దాకా ఉన్నాయి. అవన్నీ చైనా నుంచే నడుస్తున్నాయి. ఈ సైట్లు భారతీయ యువతను టార్గెట్ చేస్తూ... బెట్టింగ్ పేరుతో... రోజూ వందల కోట్లు లాగేస్తున్నాయి.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: