‘సంఘ సంస్కర్తలు’ పుస్తకావిష్కరణకు గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వానం...

దేవుడి ముందు పేద గొప్ప బేధం లేదని, అందరూ సమానులే అని ఆచార్య రామానుజులు చాటి చెప్పారని రంగరాజన్ తెలిపారు.

news18-telugu
Updated: March 13, 2020, 11:26 PM IST
‘సంఘ సంస్కర్తలు’ పుస్తకావిష్కరణకు గవర్నర్‌ తమిళిసైకి ఆహ్వానం...
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌, చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్
  • Share this:
త్వరలో ఆవిష్కరించబోయే ‘సంఘ సంస్కర్తలు’ పుస్తకావిష్కరణకు  రావాల్సిందిగా తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్‌కు ఆహ్వానం అందింది. ఆలయ పరిరక్షణ ఉద్యమం నిర్వహిస్తున్న చిలుకూరు ా ఆలయ ప్రధాన అర్చకులు సీఎస్ రంగరాజన్ నేతృత్వంలో సామాజిక సమరసత్తా వేదికకు చెందిన డాక్టర్ వంశీ తిలక్, ప్రొఫెసర్ నర్సింగ్ దాస్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, అప్పాల ప్రసాద్ తదితరులు గవర్నర్ తమిళి సై సౌందర్‌రాజన్‌ను కలిశారు. చిలుకూరు ఆలయంలో తాను చేపట్టిన ‘ముని వాహన సేవ’ కార్యక్రమం గురించి వివరించారు. (ముని వాహన సేవ అంటే బ్రాహ్మణ అర్చకుడు తన భుజాలపై ఓ దళితుడిని మోసుకుంటూ ఆలయ గర్భగుడి లోకి తీసుకుని వెళ్లడం). తమిళనాట 2700 సంవత్సరాల క్రితం ఈ సంప్రదాయం ఉంది. సనాతన ధర్మ సూక్షాన్మి బోధించే ఈ సంప్రదాయం వైష్ణవ ఆలయాల్లో ఉంటుంది.

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసిన ఆలయ పరిరక్షణ ఉద్యమ ప్రతినిధులు


దేవుడి ముందు పేద గొప్ప బేధం లేదని, అందరూ సమానులే అని ఆచార్య రామానుజులు చాటి చెప్పారని రంగరాజన్ తెలిపారు. అలాగే, సంత్ రవిదాస్ తన బోధనల ద్వారా సమాజంలోని అన్ని వర్ణాల వారిని భక్తి మార్గంలో నడిపారని గుర్తు చేశారు. సమాజంలో అసమానతలను తొలగించాల్సిన బాధ్యత మన మీద ఉందన్నారు.

ప్రస్తుతం సమాజంలో కులం, తరగతి పేరుతో ఉన్న వివక్షలకు తావులేదన్నారు రంగరాజన్. హైదరాబాద్‌లో 2700 ఏళ్ల తర్వాత తొలిసారి దళిత భక్తుడిని ఆలయంలోకి తీసుకెల్లినట్లు చెప్పారు. ఆదిత్య పరాశ్రీ అనే భక్తుడిని జియాగూడలోని రంగనాథ ఆలయంలోకి ప్రవేశం కల్పించినట్లు గవర్నర్‌కు వివరించారు రంగరాజన్. దేవుడి దగ్గర భక్తులందరూ సమానం అని చాటి చెప్పేందుకు అలా చేసినట్లు చెప్పారు.
First published: March 13, 2020, 11:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading