హోమ్ /వార్తలు /తెలంగాణ /

తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాలపై హైకోర్టులో పిటిషన్..మరికాసేపట్లో విచారణ

తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాలపై హైకోర్టులో పిటిషన్..మరికాసేపట్లో విచారణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన 16 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు నష్టపరిహారం కూడా చెల్లించాలని పిటిషనర్ కోరారు

ఇంటర్ బోర్డు వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. తాజాగా ఇంటర్ బోర్డు తప్పిదాలపై బాలల హక్కుల సంఘం స్పందించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది .బాధ్యులపై 304 సెక్షన్ పెట్టాలని బాలల హక్కుల సంఘం నేత అచ్చుతరావు పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన 16 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు నష్టపరిహారం కూడా చెల్లించాలని కోరారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అచ్యుతరావు పిటీషన్‌లో కోరారు. దీనిపై ఆయన హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై స్పందంచిన న్యాయస్థానం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం 2.15లకు విచారణ చేపట్టేందుకు సిద్దమైంది న్యాయస్థానం. మరోవైపు ఇప్పటికే ఇంటర్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గత నాలుగురోజులుగా ఇంటర్ బోర్డు ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంపై స్పందించింది. దీనిపై ముగ్గురు వ్యక్తులతో కమిటీ కూడా నిర్ణయించింది. అయితే కమిటీ రిపోర్టు వచ్చాకే చర్యలు తీసుకుంటామని తెలిపారు విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి. బాధ్యులపై జరిమానా విధించి డిబార్ పరిధి కూడా పెంచుతామన్నారు. మరోవైపు నాంపల్లిలో ఇంటర్ బోర్డు వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడెంచల భద్రతను పెంచారు.

First published:

Tags: EDUCATION, High Court, Telangana intermediate results, Telangana News

ఉత్తమ కథలు