ఈ క్రమంలోనే ఇటివల కొంతమంది జిల్లా కలెక్టర్లు ఆదర్శవంతమైన పాలన అందించడంతోపాటు అంతే అదర్శంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే సాధారణ ప్రజలే చదువు కోసం ఉన్నత స్థాయి స్కూళ్లలో చదివిస్తున్న పరిస్థితి మరోవైపు ప్రభుత్వ స్కూళ్లంటే ఓ రకమైన చిన్నచూపు సైతం వారిలో ఉంటుంది. దీంతో అప్పులు చేసి మరి వారిని అత్యున్నతమైన స్కూళ్లలో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. దీంతో ప్రభుత్వ స్కూళ్లన్ని ఖాలీ అయి ప్రవేటు కార్పోరేట్ విద్యాసంస్థల్లో డిమాండ్ ఎక్కువవుతోంది. అయితే ఓ జిల్లా కలెక్టర్ సహాసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా తన పిల్లలను అంగన్వాడి స్కూళ్లో చేర్పించి అక్కడి ఫుడ్ తినిపించడంతో పాటు చదువు చెప్పిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కుమురం భీం జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ ( komaram bheem district )కు ఇద్దరు కుమార్తెలు. అయితే తన ఇద్దరు కుమార్తెలు నిర్వికరాజ్, రిత్వికరాజ్లను అంగన్వాడీ కేంద్రానికి పంపిస్తున్నారు. ( Rahulraj ) ఈ ఇద్దరు చిన్నారులు జన్కాపూర్-1 కేంద్రంలోని తమ తోటి పిల్లలతో ఆడుతూపాడుతూ చిన్న చిన్న పదాలను వల్లే వేస్తూ.. సంతోషంగా గడుపుతున్నారు. గత మూడు నెలలుగా కలెక్టర్ పిల్లలు అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లడంతోపాటు.. ఇక్కడ పెట్టె భోజనమే తింటున్నారని అంగన్వాడి టీచర్ చెబుతోంది. అయితే ఓ కలెక్టర్ పిల్లలే ప్రభుత్వ స్కూళ్లో చదువుకోవడంతో ప్రజల్లో కూడా ఆసక్తి పెరిగింది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలెక్టరు రాహుల్రాజ్ పై నెటిజన్లు మీరు పలువురికి స్ఫూర్తి అంటూ సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇది చదవండి : పులులు లెక్కించేందుకు వెళ్లిన మహిళ అధికారి, అదే.. పులికి బలి..!
ఇటివల భద్రాచలం జిల్లా కలెక్టర్ అనుదీప్ తన భార్య మాధవిని డెలివరి కోసం ఇటీవలే ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. సకల సౌకర్యాలు ప్రభుత్వం తరుపున ఉన్నా తాను పనిచేస్తున్న జిల్లాలోని ఆసుపత్రిలో భార్యను ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరికి చేర్పించడంతో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆయనకు పలువురు మంత్రులతో పాటు స్థానిక ప్రజలు ప్రశంసలు కురిపించారు. కాగా అంతకుముందు జయశంకర్ జిల్లాలో కలెక్టర్గా విధులు నిర్వహించిన మురళి కూడా తన కూతురును ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరి చేయించి ఆదర్శరంగా నిలిచారు.
ఇది చదవండి : ఆస్తికోసం భర్తను , భార్య ఏం చేసిందంటే.. ?
జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సువర్ణ.. కాగజ్ నగర్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకున్నారు. ఆమెకు నార్మల్ డెలివరీ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.