హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad news : యాక్సిడెంట్‌తో మారిన ఆ ఇద్దరి తలరాత .. డైరెక్ట్‌గా యముడి దగ్గరకే జర్నీ

Sad news : యాక్సిడెంట్‌తో మారిన ఆ ఇద్దరి తలరాత .. డైరెక్ట్‌గా యముడి దగ్గరకే జర్నీ

Accident victims

Accident victims

SAD NEWS: ప్రాణ స్నేహితులు అనే మాట మాత్రమే అందరూ విని ఉంటారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. జీవితంలో ఒకరు ఉద్యోగంతో స్థిరపడితే మరొకరు పని నేర్చుకొని షాపు పెట్టుకున్నాడు. జీవితాల్లో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఆ ఇద్దరు చిన్ననాటి స్నేహితులను మృత్యువు కూడా విడదీయలేకపోయింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Jagtial, India

  (P.Srinivas,New18,Karimnagar)

  ప్రాణ స్నేహితులు అనే మాట మాత్రమే అందరూ విని ఉంటారు. చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. జీవితంలో ఒకరు ఉద్యోగంతో స్థిరపడితే మరొకరు పని నేర్చుకొని షాపు పెట్టుకున్నాడు. జీవితాల్లో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఆ ఇద్దరు చిన్ననాటి స్నేహితులు జగిత్యాల(Jagityal)జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం(Road accident)లో ఒకే క్షణంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికుల్ని కంటతడ పెట్టించింది. పాతికేళ్లు కలిసి పెరిగిన స్నేహితుల్ని చివరకు మృత్యువు కూడా విడదీయ లేకపోయిందని విచారం వ్యక్తం చేశారు.

  Telangana | NCRB : 2021లో చిన్నారులపై నేరాలకు పాల్పడిన కేసుల్లో తెలంగాణ టాప్ .. ఎన్‌సీఆర్‌బీ రిపోర్ట్‌లో ఏముందంటే  చావు కూడా విడదీయలేకపోయింది..

  కొన్ని రోడ్డు ప్రమాదాలు తీరని బాధను మిగుల్చుతాయి. మరొన్ని దుర్ఘటనలు కొన్నికుటుంబాల్ని రోడ్డు పడేలా చేస్తాయి. ఊపించని విధంగా జరిగే యాక్సిడెంట్‌కి ఇద్దరు ప్రాణస్నేహితులు చనిపోవడంతో ఆ రెండు కుటుంబాలు బోరున విలపిస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో ఆదివారం రాత్రి యాక్సిడెంట్ జరిగింది. వెల్గటూర్ మండలం స్తంభంపల్లి నర్సింగోజు సాగర్, కొప్పు శ్యాంసుందర్ అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. బైక్ యాక్సిడెంట్‌లో మృతి చెందిన కొప్పు శ్యాంసుందర్,నర్సింగోజు సాగర్ ఇద్దరూ స్నేహితులు. గొల్లపల్లి మండలం లొత్తునూరుకు చెందిన వాళ్లుగా గుర్తించారు.

  ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ..

  శ్యాంసుందర్ సర్వేయర్ డిప్లొమా పూర్తి చేసి వెల్గటూరులో మెగా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. సాగర్ వెల్గటూరులో వెల్డింగ్ షాప్ పెట్టుకున్నాడు. ఇద్దరూ చిన్ననాటి నుంచి 28సంవత్సరాల వరకు కలిసి , మెలిసి తిరిగారు. శ్యాంసుందర్‌కి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదిరింది. ఈక్రమంలోనే స్నేహితులు ఇద్దరూ బైక్‌పై ఆదివారం మధ్యాహ్నం లక్షెట్టిపేట వెళ్లారు. రాత్రి తిరిగి వస్తుండగా 9.40 గంటలకు రాయపట్నం వైపు అతివేగంగా లోడుతో వస్తున్న భారీ టిప్పర్ బైక్‌ని ఢీకొట్టింది. టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్తగా వ్యవహరించడంతో బైక్‌ సుమారు 100 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది . శ్యాంసుందర్ టిప్పర్ ముందు టైర్ల కింద బైక్‌తో సహా ఇరుక్కొని చనిపోయాడు. సాగర్ వెనక చక్రాల కింద నలిగిపోయాడు. రెప్పపాటు సమయంలో ఇద్దరు స్నేహితులు ప్రాణాలు విడిచారు.

  Telangana : ఆ ఊరిలో భూమి మీదే కాదు నేలలో కూడా ఆలయాలున్నాయి .. 400టెంపుల్స్ ఉన్న ఆ గ్రామం ఎక్కడుందంటే


  ప్రమాదకరంగా మూలమలుపు కందకాలు..

  స్తంభంపల్లి కొత్తపల్లి మధ్య రోడ్డు పల్లంగా ఉండటంతో వాహనాలు ఇక్కడ మితిమీరిన వేగంతో వెళ్తాయి . స్తంభంపల్లి స్టేజీ నుంచి కుడివైపు తిరిగితే లొత్తునూరు - చిల్వాకోడూరు రహదారి ఉంటుంది . ఇక్కడ మూలమలుపు సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి . రాయపట్నం వెళ్లేటప్పుడు ఎడమ వైపు రహదారిపై కందకాలు ఉన్నాయి . వీటిని తప్పించడానికి అదే వేగంతో కుడివైపు వెళ్లడానికి ప్రయత్నించే క్రమంలోనే వాహనదారులు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. గతంలో ఇక్కడ అనేక యాక్సిడెంట్‌లు జరిగాయి.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Jagityala, Road accident, Telangana News

  ఉత్తమ కథలు