పిల్లలను కని పసిగుడ్డులనే ఎక్కడో ఓ చోట లేదా చెత్త కుప్పల్లో పడేసే వాళ్లను చూశాం. కాని ప్రాణం ఉన్న పసిగుడ్డును బొందతీసి పెట్టిన దారుణం ఒకటి వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ బస్తిలో దారుణం చోటు చేసుకుంది. బతికున్న పసిగుడ్డు కన్నతల్లి పాతిపెట్టింది. అదికూడా ఆసుపత్రి పక్కన పాతిపెట్టడడం సంచలనంగా మారింది. అయితే ఆసుపత్రి వైపుకు వెళుతున్న ఓ మహిళకు భూమిలో నుండి పసిపాప ఏడుపు వినిపించింది. అక్కడి వెళ్లిన చూసిన మహిళ షాక్‌కు గురయ్యింది. ప్రాణాలతో పాతిపెట్టే ధైర్యం లేక సగం మేర భూమిలో పాతిపెట్టారు. ఏడ్చి ఏడ్చి చనిపోతుందని భావించారు. కాని ఆ పాప ఏడుపు విన్న మహిళ వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు పాపను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.కాగా ఆ పాప ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కాగా పాపను పాతిపెట్టిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Up news