హోమ్ /వార్తలు /తెలంగాణ /

Child Marriages: కరోనా కాలంలో తెరపైకి బాల్యవివాహాలు.. ఆన్ లైన్ తరగతుల పేరుతో యువత పక్కదారి..!

Child Marriages: కరోనా కాలంలో తెరపైకి బాల్యవివాహాలు.. ఆన్ లైన్ తరగతుల పేరుతో యువత పక్కదారి..!

అయితే ఇదే అంశంపై రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతుండగానే గత నెలలో ఆగస్టు 26న, శశికుమార్ మరో యువతిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు కానిస్టేబుల్‌పై హైదరాబాద్‌లోని కుల్సుంపుర, నాగర్‌ కర్నూల్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది..

అయితే ఇదే అంశంపై రెండు వర్గాల మధ్య చర్చలు జరుగుతుండగానే గత నెలలో ఆగస్టు 26న, శశికుమార్ మరో యువతిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న బాధితురాలు కానిస్టేబుల్‌పై హైదరాబాద్‌లోని కుల్సుంపుర, నాగర్‌ కర్నూల్‌ పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేసింది..

Minor Marriages: కరోనా మొదలైన దగ్గర నుంచి విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఆన్ లైన్ క్లాసుల పేరుతో యువత ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇలా మంచికి కాకుండా ఫోన్లను చెడుకు ఉపయోగించడం వల్ల అమ్మాయిలు పక్కదారి పడుతున్నారు. వీటిపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు మైనర్ తీరకుండానే పెళ్లి చేసేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  (సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)

  పాలమూరు ఉమ్మడి జిల్లాలో కరోనా కాలంలో పాఠశాలలు మూతపడడంతో చిట్టి కాళ్లకు మెట్టెలు వేస్తున్నారు. తల్లిదండ్రులు కరోనా నేపథ్యంలో బాలికల పరిస్థితి ఆగమయేగోచరంగా మారింది. రెండేళ్లుగా బడులు మూతపడడంతో ఆన్లైన్ తరగతులు జరుగుతున్నాయి. ముఖ్యంగా 9, 10 తరగతులు చదువుతున్న ఆడపిల్లలు సెల్ఫోన్లను ఎక్కువగా వాడుతున్నారు. ఆన్లైన్ పాఠాలు వినడం ఏమో గాని చాలామంది పక్కదారి పడుతున్నారు. ఫోన్ల లో చాటింగ్ చేస్తూ చదువులపై నియంత్రణ కోల్పోతున్నారు. ఆకర్షణ కు లోనై ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ రెండేళ్లలో పదుల సంఖ్యలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లో చాలా మంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు వయస్సు రాకున్నా పెళ్లిళ్లు చేయాలని చూస్తున్నారు. కరోనా నేపథ్యంలో గుట్టుచప్పుడు కాకుండా కానీ చేస్తున్నారు. మారుమూల పల్లెల్లో ఎలాంటి హడావుడి లేకుండా పోవడంతో చాలా సంఘటనలు పోలీసుల దృష్టికి వెళ్లడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 89 బాల్యవివాహాలు అధికారులు ఆపేశారు. గుట్టుచప్పుడు కాకుండా చదువులకు దూరమై ఆన్లైన్ తరగతుల పేరుతో ఫోన్ లకు పరిమితమైన బాలికలు చెడు వ్యసనాలకు లోనవుతున్నారు. ఇంటి దగ్గర ఉన్న బాలికలకు ఆకతాయిల వేధింపులు ఎక్కువ అయ్యాయి. మరికొందరు బాలికలు మోసాలకు గురవుతున్నారు .

  ఇలాంటి పరిస్థితులను గమనించిన తల్లిదండ్రులు పెళ్లిళ్లు చేయాలని భావిస్తున్నారు. బతుకుదెరువులకు వలస వెళ్లే కుటుంబాల్లో చదువులకు దూరమై ఇంటి దగ్గరే ఉంటున్నా ఆడపిల్లలకు పెళ్లి చేస్తే భారం తగ్గిపోతుందని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. ఇలాంటి ఆలోచనలతో బిడ్డలకు గుట్టుచప్పుడు కాకుండా పెళ్లిళ్లు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా సరిహద్దుల్లోని కర్ణాటక ప్రాంతాలకు వెళ్లి ఆలయాల్లో వివాహాలు జరిపిస్తున్నారు. మరికొందరు గ్రామీణ ప్రాంతాల్లో రాత్రికి రాత్రే బాల్య వివాహాలు నిర్మూలనకు అధికారులు స్వచ్ఛంద సంస్థలు అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం రావడం లేదు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బాల్య వివాహాలు జరుగుతున్నట్లు చైల్డ్ లైన్ కు 89 ఫోన్ లు వచ్చాయి. అధికారుల సహకారంతో వెళ్లి ఆపేశారు. బాల్యవివాహాల తో జరిగే అనార్థాలు పై గ్రామాల్లో ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా ఫలితం లేదు. భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య అధికారులు వివరిస్తున్నా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు.

  మే నెలలో ముహూర్తాలు ఉండడంతో ఇప్పటికే చాలా వివాహాలు జరిగాయని చెప్తున్నారు. కొన్ని మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇటీవల నారాయణపేట జిల్లా పుత్తూరు మండలం లోని ఓ గ్రామంలో భార్య మరణించిన వ్యక్తితో బాలికకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. వివాహానికి ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న శిశు సంక్షేమ శాఖ అధికారులు వచ్చి బాల్యవివాహాన్ని అడ్డుకున్నారు. కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి బాలికను సెట్ హోమ్ కు తరలించారు. బాల్య వివాహాల పై ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విస్తృతంగా ప్రచార నిర్వహిస్తున్నామని.. బాల్యవివాహాల తో కలిగే అనర్థాలను విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వివరిస్తున్నామని చైల్డ్ లైన్ ఉమ్మడి జిల్లా సమన్వయకర్త రాజునాయక్ అన్నారు. అయినా అక్కడ అక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి సారించి అవగాహన కల్పిస్తామని తెలిపారు.


  కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భాలు ఇలా..

  నాగర్ కర్నూల్ జిల్లా లోని బిజినపల్లి మండలం లోని ఓ గ్రామంలో శుక్రవారం బాల్య వివాహాన్ని బృందం అడ్డుకుంది బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలి పెట్టరు. మద్దూర్ మండలం లోని గ్రామంలో పదో తరగతి పూర్తయిన బాలికను ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిశ్చయించారు సమాచారం తెలుసుకున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు భూమిక పెళ్ళిని ఆపేశారు. కోస్గి మండలం లోని బాల భద్రయ్య పల్లి లో పదో తరగతి చదువుతున్న బాలికకు కుటుంబ సభ్యులు వివాహానికి ఏర్పాటు చేశారు చైల్డ్ లైన్ కు సమాచారం రావడంతో వారు వచ్చి వివాహాన్ని ఆపేశారు. మద్దూరు మండలంలోని పల్లెర్ల భూ నీడ్ లు ఇటీవల బాల్య వివాహాలు జరుగుతున్నట్లు చైల్డ్ లైన్ కు వచ్చిన సమాచారంతో అధికారులు ఆపేశారు రెండు కుటుంబాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Child marriages, Mahabubnagar, Minor, Online classes

  ఉత్తమ కథలు