Home /News /telangana /

CHILD KILLED BETWEEN WIFE AND HUSBAND FITING AT HYDERABAD VRY

Hyderabad : మద్యం మత్తులో తల్లిదండ్రుల ఘాతుకం.. ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన పసికందు...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : హైదరాబాద్ నగరంలో మరో దారుణం చోటు చేసుకుంది. భార్య భర్తల మధ్య ఘర్షణ పసికందును చిదిమేసింది. విచక్షణ కోల్పోయిన ఇద్దరి మధ్య పసిప్రాణం గాల్లో కలిసి పోయింది. ఈ సంఘటన నగరంలోని సైదాబాద్‌లోని పూసల బస్తిలో చోటు చేసుకుంది.

  సమాజంలో కొన్ని సంఘటనలు జుగుప్స కల్గించే విధంగా ఉంటాయి.. కన్న తల్లిదండ్రులే తమ బిడ్డలను దారుణంగా చంపడం.. తాము ఏం చేస్తున్నామో తెలియకుండా వ్వవహరించడం లాంటి ఘటనలతో చిన్నారుల బతుకులు చిద్రం అవుతున్నాయి.. తల్లిదండ్రుల తీరుతో ఎంతోమంది పిల్లలు రోడ్డు పడడం లేదా ఇతర మార్గాల్లోకి వెల్లడం లాంటి సంఘటనలకు కారణం అవుతున్నారు.. ఇలా ఇద్దరు భార్య భర్తలు విచక్షణ కొల్పోవడంతో పసికందు ప్రాణాలు విడిచిన సంఘటన సంచలనంగా మారింది,. భార్య భర్తల మధ్య ఘర్షణ ఇందుకు కారణం అయింది. ఈ క్రమంలోనే శుక్రవారం మద్యం మత్తులో ఉన్న భర్త.. భార్యపై యిచేసుకున్నాడు. భార్యను కొడుతున్న క్రమంలో 22 రోజుల పసికందు చనిపోయింది.

  సైదాబాద్ (saidabad) పోలీసుల కథనం ప్రకారం.. సైదాబాద్‌ డివిజన్‌ పూసల బస్తీ పరిధి క్రాంతి నగర్‌బస్తీకి చెందిన పొదిల రాజేష్‌ (36), జాహ్నవి (25) దంపతులు. కాగా రాజేష్‌(rajesh) నగరంలోనే సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వారికి ఇదివరకే ఓ బాబు ఉండగా.. ఇటివల మరో పిల్లాడు పుట్టాడు.. కాగా వారికి ఇద్దరికి కూడా మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి (friday night) దంపతులిద్దరూ మద్యం తాగారు. మద్యం మత్తులో భార్యాభర్తలు గొడవకు దిగారు. ఆవేశంలో భర్త ప్లాస్టిక్‌ పైపుతో భార్య మీద దాడి చేశాడు.

  ఇది చదవండి : దుమారం రేపుతున్న మంత్రి కేటీఆర్ ట్వీట్.. వ్యాక్సిన్ ఫోటోలపై రచ్చ


  దీంతో భర్త దెబ్బలనుండి తప్పించుకునేందుకు జాహ్నవి తన 22 రోజుల పిల్లాడిని అడ్డుగా పెట్టింది. ఈ గొడవలో చిన్నారి కంటిపై దెబ్బతగిలింది. భార్య తనను తాను రక్షించుకునే క్రమంలో శిశువు గొంతును గట్టిగా పట్టుకుంది. ఊపిరాడకపోవడంతో పసికందు అపస్మారకస్థితికి చేరింది. స్థానికులు గమనించి హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి..(hospitala) మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నీలోఫర్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

  ఇది చదవండి : పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే.. రైతు బంధు, రైతు బీమాలు అవసరమే లేదు..


  దంపతులిద్దరు గతంలో కూడా పిల్లల విషయంలో ఇలాగే ప్రవర్తించారు. రెండేళ్ల క్రితం వారి తొలి సంతానం.. బాబు ఐదు నెలలు ఉన్నప్పుడే మద్యం మత్తులో ఇంట్లో నుంచి బయటికి విసిరేసి దారుణానికి ఒడి గట్టారు... దీంతో ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో...పిల్లాడి సంరక్షణ కోసం యూసుఫ్‌గూడలోని శిశువిహార్‌లో ఉంచినట్టు తెలుస్తోంది.. ఇక ఇటివల పుట్టిన రెండో కుమారుడు కూడా ఇద్దరు భార్య భర్తల మధ్య ఘర్షణకు బలైన తీరుతో సంచలనంగా మారింది. విషయం తెలుసుకున్న పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Hyderabad, Hyderabad crime

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు