Home /News /telangana /

CHIEF SECRETARY SOMESH KUMAR SAID STEPS WERE BEING TAKEN TO COMPLETE 15 LAKH DOSES OF THE VACCINE IN THE JOINT MAHBUBNAGAR DISTRICT BY THE END OF DECEMBER PRV MBNR

Corona vaccination: "అవసరమైతే గ్రామాలకు వెళ్లి, అక్కడే బస చేసి వ్యాక్సినేషన్​ పూర్తి చేయండి" : అధికారులతో సీఎస్​ సోమేశ్​కుమార్​

సమావేశం నిర్వహిస్తున్న సీఎస్​

సమావేశం నిర్వహిస్తున్న సీఎస్​

ఉమ్మడి మహబూబ్ నగర్ (Mahbubnagar) జిల్లాలో డిసెంబర్ చివరి నాటికి 15 లక్షల డోసుల వ్యాక్సిన్ ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ (Somesh Kumar) తెలిపారు.

    ఉమ్మడి మహబూబ్​నగర్​ (Mahbubnagar) జిల్లాలో డిసెంబర్ చివరి నాటికి 15 లక్షల డోసుల వ్యాక్సిన్ ను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన (CS) కార్యదర్శి సోమేశ్ కుమార్ (Somesh Kumar) తెలిపారు. శుక్రవారం ఆయన రెవెన్యూ సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల కలెక్టర్లు , అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు , డి పి వో లు తదితరులతో కోవిడ్ వాక్సినేషన్ (covid vaccination) పై సమీక్ష నిర్వహించారు. అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు గాను సూక్ష్మ ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ ( corona vaccination) బాగాలేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, గ్రామాలకు వెళ్లి అవసరమైతే అక్కడే బస చేసి వాక్సినేషన్ టార్గెట్ పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులను భాగస్వాములు చేయాలని, వాక్సినేషన్ పై ప్రతిరోజు మీడియాకు సమాచారం అందించి ప్రతి ఒక్కరు వెల్లడి వేసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.

    కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ల పై..

    వ్యాక్సినేషన్ (corona vaccination) వేగవంతం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయా జిల్లాలలో ప్రత్యేక సమీక్షలను చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.వాక్సినేషన్ , కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ల పై క్యాబినెట్ ఉపసంఘాన్ని నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర వ్యాప్తంగా 100% వాక్సిన్ కు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు, ఇందుకుగాను అందరూ కృషి చేయాలని కోరారు.

    నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు మండలాలకు ప్రత్యేక అధికారులను (special officers) నియమించాలని, అదేవిధంగా ప్రతి సబ్ సెంటర్ కు ఎన్ని గ్రామాలు ఉన్నాయి, మొదటి, రెండు డోసులు (first two doses) ఎవరు ఎవరు తీసుకున్నారు, సబ్ సెంటర్ యూనిట్ గా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు .

    ఆయా సబ్ సెంటర్ వారీగా తేదీలు నిర్ధారించుకొని వ్యాక్సినేషన్ వేయాలని చెప్పారు. వ్యాక్సినేషన్ వేసుకొనని వారిని వేసుకునేలా మొబిలైజేషన్ బృందాలను,వాక్సినేషన్ బృందాలను వేరువేరుగా ఏర్పాటు చేయాలని, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, విఆర్వోలు, అంగన్వాడీ, ఆశలపై బాధ్యత పెట్టాలని చెప్పారు.

    ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు..

    మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో కూడా వాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, గ్రామాల (villages) పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఉదయాన్నే ఆ కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రిస్టమస్ వరకు ప్రతి అధికారి, ప్రతి రోజు వ్యాక్సిన్ పైనే దృష్టి కేంద్రీకరించాలని, వ్యాక్సిన్ కేంద్రాలు ఉదయం 8 నుండి సాయంత్రం8 వరకు నడవాలని తెలిపారు.

    కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి..

    రాష్ట్రంలో వాక్సిన్ కు ఎలాంటి కొరత లేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న లక్ష్యాలను సాధించడంతో పాటు, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాలలో వ్యాక్సిన్ వేసేందుకు వచ్చే బృందాలకు అల్పాహారం ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు.

    24 లక్షల వాక్సిన్ డోసుల లక్ష్యం..

    ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో నిర్దేశించిన 24 లక్షల వాక్సిన్ డోసుల లక్ష్యం ఎట్టి పరిస్థితిలో పూర్తి కావాలని, ఇదే ప్రాధాన్యతగా, వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు, డిసెంబర్ చివరి నాటికి మిగిలిపోయిన15 లక్షల టార్గెట్ పూర్తి కావాలని ఆయన పునరుద్ఘాటించారు.

    ఈ సందర్భంగా మహబూబ్​నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు , నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, నారాయణపేట జిల్లా కలెక్టర్ హరి చందనలు వారి వారి జిల్లాలవారీగా వ్యాక్సినేషన్ లక్ష్యాలు ,ఇప్పటి వరకు సాధించిన వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయా జిల్లాల ఆదనపు కలెక్టర్లు ,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కూడా వాక్సిన్ పై సమీక్షించారు. అంతకు ముందు సి ఎస్ సమాచార శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను తిలకించారు.

    పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా,వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రిజ్వి, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు, డి ఎం ఈ రమేష్ రెడ్డి ,ఓ ఎస్ డి టు సీఎం గంగాధర్, అన్ని జిల్లాల స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు , మున్సిపల్ కమిషనర్లు, డి పి ఓ లు తదితరులు హాజరయ్యారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Corona Vaccine, Cs somesh kumar, Mahbubnagar

    తదుపరి వార్తలు