• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • CHICKEN RATES ARE SKY ROCKETING IN TELANGANA GOVT STEPS IN TO CURB THE PRICE BA

తెలంగాణలో కొండెక్కిన చికెన్ రేట్లు... ‘కోత’ పెట్టేందుకు రంగంలోకి ప్రభుత్వం...

తెలంగాణలో కొండెక్కిన చికెన్ రేట్లు... ‘కోత’ పెట్టేందుకు రంగంలోకి ప్రభుత్వం...

ప్రతీకాత్మక చిత్రం

రెండు వారాల వ్యవధిలో కేజీ చికెన్ ధర సుమారు రూ.80 వరకు పెరిగింది. దీన్ని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది.

  • Share this:
    తెలంగాణలో ఈ మధ్య కాలంలో చికెన్ రేట్లు బాగా పెరుగుతున్నాయి. రెండు వారాల క్రితం కేజీ రూ.180 వరకు పలికిన ధర గత వారం రూ.230 వరకు చేరింది. ఈవారం రేట్లు మరింత పెరిగాయి. కేజీ రూ.260 వరకు ధర పలుకుతోంది. ఆదివారం కూడా కావడంతో రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రెండు వారాల వ్యవధిలో కేజీ చికెన్ ధర సుమారు రూ.80 వరకు పెరిగింది. అయితే, వారం వారానికి పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగుతోంది. వచ్చే సోమవారం ఈ అంశంపై పశు సంవర్ధక శాఖ సమీక్ష నిర్వహించనుంది. చికెన్ తక్కువ ధరకే విక్రయించేలా చర్యలు తీసుకోనున్నారు. ఎంత ధరకు విక్రయించాలనే అంశంపై ఓ నిర్ణయం కూడా తీసుకోనున్నారు.

    చికెన్ తింటే కరోనా వస్తుందంటూ వైరస్ వచ్చిన కొత్తలో ప్రచారం జరగడంతో జనం అసలు చికెన్ షాపుల వైపు చూడడమే మానేశారు. ఆ దెబ్బకు కేజీ చికెన్ రూ.50కి పడిపోయింది. కోళ్లకు మేత, వాటిని రవాణా చేసి షాపుల వరకు తీసుకువెళ్లేంత ఖర్చులు కూడా రాకపోవడంతో కోళ్ల ఫారాల వద్దే ఉచితంగా పంచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే, చికెన్ తినడం మంచిదని సాక్షాత్తూ సీఎం కేసీఆర్ కూడా ప్రకటించిన తర్వాత మళ్లీ జనం చికెన్ తినడం మొదలు పెట్టారు. ఆ తర్వాత రేట్లు పెరగడం మొదలయ్యాయి.

    అదే సమయంలో చికెన్ రేట్లు తగ్గిన కొత్తలో అందరూ మటన్ వైపు చూడడంతో మటన్ రేట్లు పెరిగిపోయాయి. కేజీ మటన్ ధర రూ.800, రూ.900 వరకు కూడా విక్రయించారు. ఆ సమయంలో తెలంగాణ పశు సంవర్ధక శాఖ రంగంలోకి దిగింది. మటన్ ధర రూ.700కు మించి విక్రయించుకుండా చర్యలు తీసుకుంది. ఇప్పుడు చికెన్ విషయంలో కూడా అలాంటి చర్యలు తీసుకోనుంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: