Chicken Prices reduced: తెలంగాణలో చికెన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. రూ. 100 తగ్గిన బ్రాయిలర్ చికెన్ ధర.. మటన్, నాటు కోడి ధరలు మాత్రం..

ప్రతీకాత్మక చిత్రం

Chicken Prices reduced: గడిచిన నెల రోజులుగా కోడి మాంసం ధర ఏకంగా రూ.100 వరకు తగ్గింది. పొరుగు రాష్ట్రాలకు ఎగుమతులు నిలిచిపోవడంతో గత నెల రూ.270 వరకు పలికిన బాయిలర్ చికెన్ ధర ఇప్పుడు 170కి తగ్గింది. కరోనా కేసులు విపరీతంగా పెరగడం నైట్ కర్ఫ్యూ విధించడంతో ఫంక్షన్లు, సభలు, సమావేశాలు తగ్గిపోయాయి. దీంతో డిమాండ్ బాగా తగ్గిపోయిందని ఫౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.

  • Share this:
    పొరుగు రాష్ట్రాలకు చికెన్ ఎగుమతులు నిలిచిపోవడంతో చికెన్ ధర పడిపోయింది. నెలరోజుల్లోనే కిలో బ్రాయిలర్ కోడి మాంసం ధర రూ.100 తగ్గింది. కరోనా కారణంగా శుభకార్యాలను వాయిదా  వేయడంతో ఫంక్షన్లు, సభలు, సమావేశాలు దాదాపు తగ్గిపోయాయి. సామూహిక భోజనాలు లేకపోవడంతో కోడిమాంసం అమ్మాకాలు బాగా తగ్గిపోయాయి. తెలంగాణలో సాధారణ రోజుల్లో 9 లక్షల కిలోల కోడి మాంసం విక్రయాలుంటాయి. ఇప్పుడు 5 లక్షల కిలోలకు మించి పోవడం లేదు. రాష్ట్రంలో కర్ఫ్యూ వల్ల రాత్రి అమ్మకాలను పూర్తిగా తగ్గడంతో వాటి డిమాండ్ పడిపోయింది. ఇతర రాష్ట్రాల్లో లాక్ డౌన్ కారణంగా దిగుమతులు చేసుకోవడం లేదు. దీంతో తెలంగాణ నుంచి ఎగుమతులు పూర్తిగా తగ్గాయి. ఎండాకాలంలో ఎండలు 40 డిగ్రీలు దాటిన ప్రాంతాల్లో కోడి పిల్లలను కాపాడటంలో పౌల్ట్రీ నిర్వాహకులు ఇబ్బందులకు గురవుతున్నారు. కిలో బరువు కోడిని పెంచాలంటే సగటున రూ.90 వరకూ పెట్టుబడి పెట్టాలి. ఇప్పుడు కిలో బరువున్న కోడిని రూ.66కే మాంసం వ్యాపారులకు విక్రయించడం నష్టాలు వస్తున్నాయన్నారు.

    కోడి గుడ్డు ధరలు కూడా రూ.4.56 ఉండగా ఇప్పుడు రూ. 3.10 పలుకుతోంది. తెలంగాణలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ జిల్లాల కోళ్ల ఫారాల్లో రోజుకు 90 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అందులో 40 లక్షల గుడ్లు బయటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. పొరుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌తో ఎగుమతి నిలిచిపోయింది. దీంతో గడ్డు ధరలు కూడా పతనం అయ్యాయి. ఓ వైపు బ్రాయిలర్ చికెన్ ధరలు పడిపోతుంటే.. మరోవైపు మేక, గొర్రె మాసం, నాటుకోడి ధరలు మాత్రం భారీగా పెరిగాయి.

    తెలంగాణ రాష్ట్రంలో నాటుకోళ్ల కొరత కారణంగా కిలో ధర రూ.400 వరకు పలుకుతోంది. కడక్‌నాథ్‌ కోడి మాంసాన్ని ఆన్‌లైన్‌లో కిలో రూ.400 నుంచి 500 వరకూ అమ్ముతున్నారు. మటన్ ధర కిలో రూ.700 నుంచి 800 వరకూ పలుకుతోంది. వీటితో పాటు కోడి గుడ్డు ధరలు కూడా పతనం అయ్యాయి.
    Published by:Veera Babu
    First published: