చేర్యాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) శ్రీనివాస్ (CI Srinivas) సస్పెండ్ అయ్యారు. ఆయన విధుల్లో సరిగా పనిచేయకుండా.. నిర్లక్ష్యంగా వ్యవహించినట్లు పై అధికారులకు మ్యాటర్ చేరింది. దాంతో సిద్ధిపేట సీపీ శ్వేత.. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆర్డర్ జారీ చేశారు.
అసలు ఈ ఆర్డర్ జారీ చేయడానికి ఓ బలమైన కారణం ఉంది. జనవరి 25న జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఓ విషయమై పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. ఆ సమయంలో సీఐ అక్కడ లేరు. వెంటనే వచ్చేస్తారని ఇతర పోలీసులు తెలిపారు. కానీ సీఐ వెంటనే రాలేదు. ఆయన కోసం ఎమ్మెల్యే... దాదాపు గంటన్నరపాటూ వెయిట్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో.. ఎమ్మె్ల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. విధులకు హాజరు కాకుండా ఆయన అనుమతి లేని వేరే ప్రాంతానికి వెళ్లారని తెలియడంతో.. ఆయనపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.