ఏం బలిసిందా..? బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన బాల్క సుమన్..

బాల్క సుమన్

మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్ థాకరే గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే శివసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో, తెలంగాణ లో కూడా అలా స్పందించాలని బాల్క సుమన్ తెరాస కార్యకర్తలను కోరారు.

 • News18
 • Last Updated :
 • Share this:
  బిజెపి, టిఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల నాయకులు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ పై ప్రభుత్వ విప్, మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అవహేళన చేస్తూ మాట్లాడితే ఊరుకోమని అన్నారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని లేనిపక్షంలో తాట తీస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు.. బిజెపి నాయకులకు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు.

  మహారాష్ట్రలో శివసేన అధినేత బాల్ థాకరే గురించి ఎవరైనా చులకనగా మాట్లాడితే శివసేన కార్యకర్తలు ఎలా స్పందిస్తారో, తెలంగాణ లో కూడా అలా స్పందించాలని తెరాస కార్యకర్తలను కోరారు. కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎంపై చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఏం బలిసిందా.. బండి  సంజయ్...’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. సమయం, సందర్భం కోసం వేచి చూస్తున్నామని.. ఆ టైం వచ్చినప్పుడు అందరి లెక్కలు తీస్తామని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పై పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సహించేది లేదని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
  Published by:Srinivas Munigala
  First published: