హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: ఎమ్మెల్యే బాల్క సుమన్ వీరాభిమాని అత్యుత్సాహం.. అతడికి అన్ని బుల్లెట్స్ ఎక్కడివి..?

Telangana: ఎమ్మెల్యే బాల్క సుమన్ వీరాభిమాని అత్యుత్సాహం.. అతడికి అన్ని బుల్లెట్స్ ఎక్కడివి..?

బుల్లెట్లతో బాల్క సుమన్ పేరు

బుల్లెట్లతో బాల్క సుమన్ పేరు

Telangana: ఓ వీరాభిమాని తన అభిమానాన్ని చాటుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించాడు. చివరకు తన మొబైల్ ఫోన్‌లో పెట్టుకున్న స్టేటస్ తో ఆ అభిమాని బుల్లెట్ల బాగోతం బయటపడింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తమకు నచ్చిన వ్యక్తులపై… ఆప్తులపై… తమకు ఉన్న అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దారిలో వెళుతుంటారు. తమ అభిమానాన్ని చూటుకోవడంలోనూ ప్రత్యేకతను చాటుకోవాలనుకుంటారు. ఇటీవల కాలంలో తమ అభిమాన నేతల పుట్టిన రోజు వేడుకలు, ఇతర శుభకార్యాలు.. ఉత్సవాలు.. వేడుకల్లో అభిమానం చాటుకునే నెపంతో నానా హంగామ చేసిన సంఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. పొడవాటి తల్వార్ ను చేతులోపట్టుకొని చిందులు వేయడం… తుపాకీని చేత పట్టుకొని గాల్లోకి కాల్పులు జరపడం వంటి ఘటనలు పలు చోట్ల వెలుగు చూశాయి. నోట్ల కట్టలు చేతబట్టుకొని గాల్లోకి వెదజల్లడం వంటివి కూడా అక్కడక్కడ జరిగాయి. అయితే ఓ అధికార టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి చెందిన కార్యకర్త, ముఖ్య నేత అనుచరుడు అన అభిమాన నేతపై అభిమానం చాటుకోవడంలో అత్యుత్సాహం ప్రదర్శించి సరికొత్త చర్చకు దారితీసిన ఘటన మంచిర్యాల (Mancherial) జిల్లాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం జిల్లాలో ఇదే హాట్ టాపిక్ గా మారింది.

  అసలు జరిగింది ఏమిటంటే… సింగరేణి (Singareni Collieries) లాభాల్లో కార్మికులకు  వాటాను ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనతో సింగరేణి వ్యాప్తంగా టిఆర్ ఎస్, దాని అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు శాసన సభ్యుడు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ (Balka Suman) అనుచరుడు కొప్పుల రవి 'జై బాల్క సుమన్' అని ఆంగ్ల అక్షరాలను తుపాకీ బుల్లెట్లతో రాసి దాన్ని తన సెల్ ఫోన్‌లో వాట్సప్  స్టేటస్ గా పెట్టుకున్నాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 62 బుల్లెట్లతో ఇలా రాసిపెట్టుకున్నాడు. ఇది కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  బాల్క సుమన్ అనుచరుడు కొప్పుల రవి శ్రీరాంపూర్ డివిజన్ లో సింగరేణి కార్మికునిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వాట్సాప్ స్టేటస్ చూసి సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్న రవి కి ఈ బుల్లెట్లు ఎక్కడి నుండి వచ్చాయని పోలీసులు ఆరా తీస్తున్నారు. అసలు ఆ బుల్లెట్లు అసలవా… నకిలివా.. తేల్చే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. విషయం తెలిసిన రవి తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు సమాచారం. రవి వ్యవహార శైలి పై కూడా పోలీసులు కూపీ లాగుతున్నట్లు చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలమే రేపిందని చెప్పవచ్చు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  ఉత్తమ కథలు