HighCourt: చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టులో విచారణ.. ఏం జరిగిందంటే..

చెన్నమనేని రమేశ్ (ఫైల్)

HighCourt: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పలు కీలక విషయాలు, అంశాలు, కేస్ లాస్ చర్చించవలసి ఉన్నందున కేసును బౌతికంగానే వాదనలు వినాలని చెన్నమనేని తరఫు న్యాయవాది వై. రామారావు కోర్టును అభ్యర్థించారు.

  • Share this:
    వేములవాడ ఎమ్మెల్యే(MLA) చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో పలు కీలక విషయాలు, అంశాలు, కేస్ లాస్ చర్చించవలసి ఉన్నందున కేసును బౌతికంగానే వాదనలు వినాలని చెన్నమనేని తరఫు న్యాయవాది వై. రామారావు కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అద్వకేట్ జనరల్ రామచంద్ర ర్రావు, కేంద్ర ప్రభుత్వ అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర రావు కూడా భౌతికంగా వాదనలు వినిపించడానికి సమర్ధించారు. అనేక రకమైన అఫిడవిట్ లు, మెమోలు, కేస్ లాస్ ఉన్నందున వాదనలకు అన్ని పార్టీలు భౌతికంగా వాదనకు చేయడానికి సిద్ధంగా ఉండాలని కోరిన హై కోర్ట్ కోరింది.

    Dalitha Bandhu: ఆ ఐదుగురు దళితబంధును తిరస్కరించారు.. ఎందుకో తెలుసా..


    చెన్నమనేని పౌరసత్వం కేసు తదుపరి విచారణ అక్టోబర్ 21 కి వాయిదా వేసింది. కొన్ని నెలల క్రితం.. చెన్నమనేని పౌరసత్వ వివాదం కేసులో విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. అప్పుడు హైకోర్టు విచారణకు కేంద్ర ప్రభుత్వం తరపున అస్సిటెంట్ సోలిసిటర్ జనరల్ రాజేశ్వర్ రావు హాజరయ్యారు. ఇదే సమయంలో… బుక్ లెట్ రూపంలో కోర్టుకు నివేదిక సమర్పించారు పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్ రావు. 2019 వోసీఐ కార్డ్ బెర్లిన్ లో ఇండియన్ అంబసి ద్వారా చెన్నమనేని తీసుకున్నాడని కోర్టుకు వివరించారు. వోసీఐ దరఖాస్తు ఫామ్ 10 కాలంలో నేషనాలిటీ జర్మనీ అని పెట్టాడని కోర్టుకు తెలియజేశారు.

    Etala Rajender: ఈటల పాదయాత్రకు బ్రేక్ పడటానికి కారణం అదేనా..?


    చెన్నమనేని రమేష్‌ బాబు.. వోసీఐ కార్డ్ మీద ఇండియాకు వచ్చి జర్మనీ పాస్‌పోర్ట్‌ మీద జర్మనీకి వెళ్తున్నట్టు తెలిపారు. ఇక, 2009 భారత దేశ పౌరసత్వం పొందినప్పుడు 2013 వరకు జర్మనీ పాస్ పోర్ట్ కాలపరిమితి ఉండేది.. అతను భారతీయుడు అయితే 2013లో జర్మనీ పాస్ పోర్ట్ ను 2023 వరకు ఎలా రెన్యూవల్ చేసుకుంటాడని వాదనలు వినిపించారు రవికిరణ్.. ఇండియన్‌ అయితే ఇండియా పాస్ పోర్ట్ మీదనే ప్రయాణం చేయాలి.. కానీ, జర్మనీ పాస్ పోర్ట్ మీదనే ప్రయాణాలు చేస్తున్నాడని కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, మీ వోసీఐ కార్డులోనే జర్మనీ నేషనలిటీ అని ఎలా రాశారని ప్రశ్నించింది హైకోర్టు..

    Huzurabad By Election: ఆ రిపోర్టు ప్రకారం హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదా.. !అసలేం జరుగుతోంది..


    ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. ఎన్నికలకు సిద్ధం కావాలని పేర్కొంది హైకోర్టు.. కాగా, తమ పిటిషనర్ చెన్నమనేనితో సంప్రదించి పూర్తి వాదనలు వినిపిస్తాయని చెన్నమనేని తరపు న్యాయవాది తెలపడంతో.. తదుపరి విచారణను ఆగస్టు 24వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. తర్వాత ఇలా వాయిదాలు పడుతూ వచ్చింది. తాజాగా మళ్లీ దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మళ్లీ వాయిదా వేసింది.
    Published by:Veera Babu
    First published: