పిల్లలు పుడతారంటూ క్షుద్రపూజలు... ఒంటరిగా ఉన్న మహిళను...

నిమ్మ‌కాలు, మిర‌ప కాయ‌లు తీసుకురా నీకు దిష్టి తీయ‌లని చెప్పారు. దీంతో వాటిని తీసుకెళ్లేందుకు ఆకృతి లోపలికి వెళ్లింది.

news18-telugu
Updated: April 20, 2019, 3:23 PM IST
పిల్లలు పుడతారంటూ క్షుద్రపూజలు... ఒంటరిగా ఉన్న మహిళను...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిజామాబాద్ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేగింది. పిల్లలు పుట్టేలా చేస్తామని ఒంటరిగా ఉండే మహిళల్ని టార్గెట్ చేశారు. వారి వద్ద నుంచి పట్టుచీరలు, నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ఇదంతా చేసింది ఏ దొంగ బాబాలో,స్వామిజీలో అనుకుంటే పొరపాటే. మహిళలే ఇలాంటి నేరానికి పాల్పడ్డారు. దీంతో వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండ‌లం గ‌న్నారం గ్రామంలో ఉద‌యం 8గంట‌ల ప్రాంతంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఇంట్లో ఒంట‌రిగా ఉన్న ఆకృతి అనే మ‌హిళ‌ను టార్గెట్ గా చేసుకున్నారు. పిల్ల‌లు పుట్ట‌ని వారికి క్షుద్ర‌పూజ‌లు చేసి పిల్ల‌లు పుట్టేల చేస్తామ‌ని చెప్పారు. నీకు పిల్ల‌లు పుట్టాలంటే 5ప‌ట్టు చీర‌లు, 10వేల రూపాయ‌ల నగదు ఇవ్వాలని అడిగారు. అడిగిందే త‌డ‌వుగా ఆకృతి త‌న వ‌ద్ద డ‌బ్బులు, చీర‌లు ఇచ్చింది.

నిమ్మ‌కాలు, మిర‌ప కాయ‌లు తీసుకురా నీకు దిష్టి తీయ‌లని చెప్పారు. దీంతో వాటిని తీసుకెళ్లేందుకు ఆకృతి అటు వెళ్లిందో లేదో అక్కడ్నుంచి పరారయ్యారు. అయితే ఇద్ద‌రు మ‌హిళలు కొత్తగా క‌నిపించడంతో మీరు ఎవ‌రు.. ఎక్క‌డి నుంచి వ‌స్తున్నారని స్థానికులు వారిని ప్రశ్నించారు. దీంతో వాళ్లు త‌డ‌బ‌డ్డారు. అనుమానం వ‌చ్చిన స్థానికులు ప‌ట్టుకొని విచారించాగా ఆస‌లు విష‌యం బ‌య‌ట ప‌డింది. దీంతో బాధితురాలు వారి బందువులు ఆ మ‌హిళ‌ల‌ను చిత‌క బాదారు. పోలీసుల‌కు స‌మాచారం అందించి వారికి అప్పజెప్పారు. నిందితులిద్దరూ జక్రాన్ ప‌ల్లి మండ‌లం తోర్లీకొండ గ్రామానికి చెందిన దేష‌మ్మ‌, గంగామ‌ణి గా గుర్తించారు. వీరి పై పోలీసులు కేసు న‌మోదుచేసుకోని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Published by: Sulthana Begum Shaik
First published: April 20, 2019, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading