హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kathi Karthika: కత్తి కార్తీకపై బంజారాహిల్స్‌లో చీటింగ్ కేసు

Kathi Karthika: కత్తి కార్తీకపై బంజారాహిల్స్‌లో చీటింగ్ కేసు

కత్తి కార్తీక (ఫైల్ పోటో)

కత్తి కార్తీక (ఫైల్ పోటో)

Kathi Karthika: అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు కత్తి కార్తీక మధ్యవర్తిత్వం చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

  యాంకర్, దుబ్బాకలో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఆమెపై బాధితుడు ఫిర్యాదు చేశాడు. భూ వివాదంలో సెటిల్‌మెంట్ చేస్తానంటూ మోసం చేసినట్టు కత్తి కార్తీకపై ఆరోపణలు వచ్చాయి. అమీన్‌పూర్ వద్ద 52 ఎకరాల భూమిని ఓ ప్రైవేటు కంపెనీకి ఇప్పించేందుకు మధ్యవర్తిత్వం చేసినట్టు బాధితుడు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. కార్తీక, అనుచరులు కోటి రూపాయలు డిపాజిట్ చేయించుకుందని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం.

  ఇదిలా ఉంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన కత్తి కార్తీక.. తన సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొదట ఇండిపెండెంట్ అభ్యర్థిగా దుబ్బాక ఉప ఎన్నికల్లో బరిలోకి దిగి ఆ తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరారు. స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ తనను గెలిపించాలని ఆమె కోరుతున్నారు.

  ఒక్కసారి అవకాశం ఇవ్వాలని… దుబ్బాక లో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చేసి చూపిస్తాను అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బహుజన బిడ్డను అయిన తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని.. బహుజనుల అభివృద్ధికి తాము ఎంతగానో కృషి చేస్తాను అంటూ చెబుతున్నారు. ప్రధాన రాజకీయ పార్టీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా కత్తి కార్తీక ఎన్నిక ప్రచారంలో దూసుకుపోతుండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. ఆమెకు పెద్ద ఎత్తున ఓట్లు పోలైతే.. అవి ఏ పార్టీకి నష్టం కలిగిస్తాయో అనే చర్చ కూడా అప్పుడే మొదలైంది. కొద్దిరోజుల క్రితం కత్తి కార్తీకపై కొందరు బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎన్నికల బరిలో నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అప్పుడే ఆమె స్పష్టం చేశారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు