హోమ్ /వార్తలు /తెలంగాణ /

Wood ganesh:74 ఏళ్లుగా ఏటా ఘనంగా చవితి ఉత్సవాలు .. నిమజ్జనం మాత్రం లేదు కారణం ఏంటో తెలుసా

Wood ganesh:74 ఏళ్లుగా ఏటా ఘనంగా చవితి ఉత్సవాలు .. నిమజ్జనం మాత్రం లేదు కారణం ఏంటో తెలుసా

WOOD GANESH

WOOD GANESH

Ganesh Chaturthi 2022: అక్కడ వినాయకుడికి నిమజ్జనం ఉండదు. చవితి నవరాత్రులకు బదులుగా 11రోజులు నిర్వహిస్తారు. 74ఏళ్లుగా ఒకే విగ్రహాన్ని పూజిస్తూ...భక్తి, శ్రద్ధలతో వేడుకలు నిర్వహిస్తున్నారు. నిమజ్జనం చేయడానికి వీలు లేకుండా గణేష్‌ నిమజ్జనాన్ని దేనితో తయారు చేశారో తెలుసా.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nirmal, India

  (K.Lenin,News18,Adilabad)

  సాధారణంగా వినాయక చవితి (Ganesh chaturthi)వచ్చిదంటే ప్రతీ ఒక్కరు తమ ఇళ్లలో వినాయక విగ్రహాలను ప్రతిష్టించుకొని కొలుస్తారు. ఇంకా ఊరు వాడా సామూహికంగా గణేష్ మండపాలను ఏర్పాటు భారీ సెట్టింగులు, కళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలు(Electric lights),అందమైన అలంకరణల నడుమ వివిధ రకాల ఆకృతుల్లో ఏకదంతుడి విగ్రహాలను ప్రతిష్టించి పూజలు చేస్తారు. మూడు, ఐదు రోజులు, ఏడు రోజులు, తొమ్మిది రోజులు, పదకొండు రోజులు, 13 రోజులు ఇలా పూజలు చేసి చివరి రోజు డిజే చప్పుళ్లు, బ్యాండు మేళాల నడుమ యువకుల నృత్యాలు, కేరింతల నడుమ ఊరేగింపు నిర్వహించి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. కాని నిర్మల్ జిల్లాలో నిర్వహించే చవితి ఉత్సవాల్లో అక్కడి గణనాథుడ్ని నిమజ్జనం చేయరు. ఇప్పుడో , గతేడాదో కాదు దాదాపు 74సంవత్సరాలు(74 years)గా ఇలాగే జరుగుతోంది. అందుకు ఓ ప్రత్యేక ఉంది.

  Hyderabad : అర్ధరాత్రి అమ్మాయిలను సీక్రెట్‌గా వీడియో తీశాడు .. వాళ్లకు తెలియడంతో పారిపోవాలని ట్రై చేసి..  నిమజ్జనం చేయకుండా చవితి ఉత్సవాలు..

  వినాయక చవితి వచ్చిదంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పల్లెల నుంచి మహానగరాల్లో ఎంతో అట్టహాసంగా, భక్తి శ్రద్ధలతో నవరాత్రి వేడుకలు నిర్వహిస్తారు. 9రోజుల పాటు వినాయకుడ్ని పూజించి చివరి రోజు చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఎక్కడైనా ఇలాగే జరుగుతుంది. కాని నిర్మల్ జిల్లాలో మాత్రం చవితి ఉత్సవాలు భిన్నంగా జరుగుతాయి. అన్నీ చోట్ల వినాయకుడి విగ్రహాల విషయానికి వస్తే మట్టితోనో లేక పోతే ప్లాస్టర్ ఆఫ్ పారీస్ తోనో వివిధ ఆకృతుల్లో తయారు చేస్తారు. కాని నిర్మల్ జిల్లా కుభీర్ మండలం నిగ్వ గ్రామానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామం పాలజ్‌లోని వినాయకుడి గుడిలో గణేష్ విగ్రహాన్ని కర్రతో తయారు చేశారు.

  అంటు వ్యాధులు తగ్గాయనే నమ్మకంతో..

  ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కర్రతో చేసిన వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి, 11 రోజులపాటు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహిస్తారు. 11వ రోజు నిమజ్జనం చేయకుండా ఆ కర్ర విగ్రహాంపై వాగు నీటిని చల్లి అనంతరం ఆలయంలోనే భద్రపరచడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇలా ఇలా చేయడానికి వెనుక పెద్ద చరిత్రే ఉంది. 1948 సంవత్సరంలో గ్రామంలో అంటువ్యాధులు ప్రబలి సుమారు 30 మందికి పైగా మరణించారు. ఆ సమయంలోనే వినాయక చవితి పండుగ వచ్చింది. అయితే ఊరంతా కలిసి గ్రామంలో వినాయకుడిని ప్రతిష్టించాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్మల్ కు చెందిన నకాషి కళాకారుడు పోలకొండ గుండాజీ చేత కర్ర వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయించుకొని తీసుకెళ్ళి ఊళ్లో ప్రతిష్టించి పూజించారు. అప్పటి నుండి అంటు వ్యాధులు పూర్తిగా తగ్గిపోయాయని స్థానికులు చెబుతారు.

  Mulugu: ప్రార్ధనకు వెళ్తున్న దంపతుల్ని వెంటాడిన మృత్యువు .. ఇద్దరు పిల్లల పరిస్థితి ఏమైందో తెలుసా  మరి కొన్ని గ్రామాల్లో కూడా కర్ర విగ్రహాలు..

  కోరి వచ్చిన భక్తుల కోరికెలను తీరుస్తూ సత్యగణేషుడిగా విరాజిల్లుతున్నఈ వినాయకుడిని దర్శించుకునేందుకు ఆదిలాబాద్ , నిర్మల్, నిజామాబాద్ , హైదరాబాద్ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర నుండి కూడా భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో గ్రామస్థులంతా కలిసి విరాళాలు పోగు చేసి వినాయక మండపాన్ని అభివృద్ది చేశారు. వినాయక నవరాత్రుల సందర్భంగా గ్రామంలో మద్యం, మాంసాలకు దూరంగా ఉండటమేకాకుండా కొంతమంది ప్రత్యేకంగా వినాయక దీక్షలు చేపట్టడం మరో ప్రత్యేకత. ఇదిలా ఉంటే కర్ర వినాయకుల విగ్రహా ప్రతిష్టాపన వైపు ఇతర గ్రామాల ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. నిర్మల్ జిల్లాలోని తానూరు మండలం భోసి గ్రామంలోనూ పాలజ్ తరహాలో కర్ర వినాయకుడిని ప్రతిష్టిస్తున్నారు. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లోనూ ఇలా కర్ర వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి కొలుస్తున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Ganesh Chaturthi​ 2022, Nirmal, Telangana News

  ఉత్తమ కథలు