హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode Bypoll : నవంబర్ 8న మునుగోడు పోలింగ్?త్వరలో ఎన్నికల షెడ్యూల్!

Munugode Bypoll : నవంబర్ 8న మునుగోడు పోలింగ్?త్వరలో ఎన్నికల షెడ్యూల్!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Munugode Polling : తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం మునుగోడు ఉప ఎన్నిక(Munugode Bypoll). అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Munugode Polling : తెలంగాణ రాజకీయాల్లో(Telangana Politics) ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం మునుగోడు ఉప ఎన్నిక(Munugode Bypoll). అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో విజయం సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని పోగొట్టుకోకూడదని కాంగ్రెస్,ఈ ఉప ఎన్నికల్లో గెలిచి బీజేపీ కార్యకర్తలలో ఉత్సాహం నింపడమే కాకుండా వచ్చే ఏడాది జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తమ విజయానికి ఇదే నాంది అని చూపెట్టుకోవడానికి బీజేపీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఉప ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో తమ సత్తాను మరోసారి విపక్షాలకు చూపెట్టాలని అధికార టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికకు ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్‌లు తమ అభ్యర్థులను ప్రకటించగా, టీఆర్‌ఎస్ మాత్రం ఆ ప్రకటనలో జాప్యం చేస్తూ విపక్షాలను అంచనా వేస్తోంది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బరిలోకి దిగగా, ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్‌ పాల్వాయి స్రవంతిని బరిలోకి దింపింది. ఎన్నికల సంఘం ఉప ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించకముందే అభ్యర్థిని ప్రకటించే ఆలోచనలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఉన్నట్లు గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.

అయితే మునుగోడు ఉప ఎన్నికపై ఈసీ(ఎలక్షన్ కమిషన్)కసరత్తు పూర్తి చేసింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ ప్రారంభంలోనే హిమాచల్ ప్రదేశ్ లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ భావిస్తోందని సమాచారం. ఈ మేరకే షెడ్యూల్ రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కంట్రోల్ తప్పిన భార్య.. గొడ్డలితో భర్త పురుషాంగాన్ని కట్ చేసింది.. ఎందుకంటే..

2017లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 9న పోలింగ్ నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు అదే రిపీట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక,మునుగోడు ఉప ఎన్నికకు నవంబర్ 8 పోలింగ్ జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. హిమాచల్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు,మునుగోడు,హర్యానాలోని మరో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారని సమాచారం. మునుగోడు ఉప ఎన్నిక ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం సైతం దృష్టి సారించింది.పోలింగ్ కేంద్రాల గుర్తింపు,సమస్యాత్మక ప్రాంతాల ఖరారు,ఈవీఎంల ఫస్ట్,సెకండ్ లెవల్ చెకింగ్ తదితరాలపై సృష్టతకు వచ్చింది. రాష్ట్ర సీఈవో కార్యాలయం నుంచి అన్ని వివరాలను తెప్పించుకున్న ఈసీ నవంబర్ ప్రారంభంలోనే పోలింగ్ పూర్తి చేయాలనుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కానుంది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Munugode Bypoll, Munugodu By Election

ఉత్తమ కథలు