ఓయూ భూములను కబ్జాను అడ్డుకునే వారిపై కేసులా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్

సామాజిక మాధ్యమాల్లో భూకబ్జాను వ్యతిరేకిస్తున్న అధ్యాపకులకు సైతం సైబర్ క్రైమ్ నోటీసులు ఇచ్చిందని, కాంగ్రెస్ ఈ భూకబ్జా బాగోతాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

news18-telugu
Updated: May 23, 2020, 5:25 PM IST
ఓయూ భూములను కబ్జాను అడ్డుకునే వారిపై కేసులా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
ఉస్మానియా యూనివర్సిటీ
  • Share this:
ఉస్మానియూ యూనివర్సిటీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లోని పెద్దల అండతో భూకబ్జా బాగోతం నడుస్తోందని, ప్రభుత్వ భూమలను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలే వాటి కబ్జాకు పాల్పడుతున్నారని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచందర్‌రెడ్డి ఆరోపించారు. మొన్నటిమొన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త మాణికేశ్వర్ నగర్‌లోని ఓయూ సెంటర్ ఫర్ డివోషనల్ స్టడీస్‌కి చెందిన 2000 గజాల కబ్జా ప్రయత్నం చేశాడన్నారు. ప్రస్తుతం బీజేపీ కేంద్ర ప్రభుత్వ బడా నేతల అండతో 8000 గజాలకు పైగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈ కబ్జా పర్వాన్ని యూనివర్సిటీకి చెందిన ఔటా, విద్యార్థి సంఘాలు, పూర్త విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. కబ్జాదారులకు అండగా ప్రభుత్వ యంత్రాంగం నిలుస్తోందని, కబ్జాని అడ్డుకుంటున్న విద్యార్థులు, అధ్యాపకులపై పోలీసు కేసులు పెడుతున్నారని విమర్శించారు. నాడు తెలంగాణ కోసం కొట్లాడినందుకు కేసులు.. నేడు తెలంగాణ ఆస్తులు కాపాడుకుంటున్నందుకు కేసులా అంటూ ఎద్దేవా చేశారు.

సామాజిక మాధ్యమాల్లో భూకబ్జాను వ్యతిరేకిస్తున్న అధ్యాపకులకు సైతం సైబర్ క్రైమ్ నోటీసులు ఇచ్చిందని, కాంగ్రెస్ ఈ భూకబ్జా బాగోతాన్ని తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఏడో నిజాం ఇచ్చిన ఫర్మాణా ఆధారంగా స్వతంత్ర ప్రతిపత్రి ఉన్న సంస్థాతో రీసర్వేకు ప్రభుత్వం ఆదేశించాలని సూచించారు. న్యాయ పరంగా, అధికారికంగా చర్యలు తీసుకొని విశ్వవిద్యాలయానికి ప్రహరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. మాజీ న్యాయమూర్తి ఈ వ్యవహారంలో చిన్న చేప మాత్రమేనని, బీజేపీ, దాని అనుబంధ సంఘాల అండతో తిమింగళాలు ఉన్నాయని పేర్కొన్నారు.

మాజీ న్యాయమూర్తిది కేవలం 311 గజాలేనని, రూ.300 కోట్లు విలువ చేసే 8000 గజాలకు పైగా కబ్జాకు కుట్ర జరుగుతోందని, అందుకు ప్రభుత్వ యంత్రాంగాలు పూర్తిగా సహకరిస్తున్నాయని వివరించారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పోరాటానికి సిద్ధంగా ఉందని చెప్పారు.
First published: May 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading