నాడు నోరుమెదపని నేతలు.. నేడు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం.. గుత్తా వ్యాఖ్యలు

సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తూ.. నిర్మాణాలు కొనసాగిస్తోందని, ఎస్ఎల్‌బీసీ సొరంగ నిర్మాణ పనులు 33 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయయని, మిగతా పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.

news18-telugu
Updated: June 6, 2020, 9:15 PM IST
నాడు నోరుమెదపని నేతలు.. నేడు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం.. గుత్తా వ్యాఖ్యలు
మండలిలో మాట్లాడుతున్న చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
  • Share this:
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణాజలాల దోపిడీ జరుగుతున్నప్పుడు మంత్రులుగా ఉండి నోరు మెదపని కాంగ్రెస్ నేతలు.. నేడు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం దారుణమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. సాంకేతిక ఇబ్బందులు అధిగమిస్తూ.. నిర్మాణాలు కొనసాగిస్తోందని, ఎస్ఎల్‌బీసీ సొరంగ నిర్మాణ పనులు 33 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయయని, మిగతా పనులు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. డిండి రిజర్వాయర్ 93 శాతం పూర్తయిందని, టీఆర్ఎస్ అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే శ్రీశైలం సొరంగ పనులపై కేసీఆర్ సమీక్షించారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గుర్తు చేశారు.
Published by: Narsimha Badhini
First published: June 6, 2020, 1:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading