CERTIFICATE OF CORONA VACCINATION DOWNLOAD WHO DIED RECENTLY IN KOTHAGUDEM VRY KMM
Vaccine mystery : వ్యాక్సిన్ మాయ..! చనిపోయిన వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నారంటూ సర్టిఫికెట్..!
ప్రతీకాత్మక చిత్రం
Vaccine mystery : వ్యాక్సినేషన్ల రికార్డ్ల కోసం అధికారులు మాయ చేస్తున్నారా..టీకా వేసుకోని వారికి కూడా, మెస్సెజ్‌లు రావడమే కాకుండా ఏకంగా సర్టిఫికెట్స్ కూడా ఎలా డౌన్లోడ్ అవుతున్నాయి..
( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
కరోనా టీకా తీసుకోకున్నా , వారి పేరుమీద సర్టిఫికెట్స్ డౌన్లోడ్ కావడమే కాదు ఏకంగా చనిపోయిన వారు కూడా టీకా వేసుకున్నట్టు మెసెజ్‌లు రావడంతో కుటుంబ సభ్యులు ఖంగుతింటున్నారు...అయితే ఇదంతా అధికారుల తప్పిదమా లేక, సాఫ్ట్వేర్ ప్రాబ్లమా అనేది తేలాలి. మొత్తం మీద టీకా వేసుకోని వారికి కూడా వేసుకున్నట్టు గత కొద్ది రోజులుగా మెసెజ్‌లు వస్తుండడంతో పాటు సర్టిఫికెట్స్ కూడా డౌన్ లోడ్ అవుతున్నాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఎక్కడో ఓ చోట ఇలాంటి మెసెజ్ పోందుతున్నవారు చాలా మందే ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే చనిపోయిన ఆరు రోజుల తర్వాత ఓ వ్యక్తి వ్యాక్సిన్ తీసుకున్నట్టు మెసెజ్ రావడంతో పాటు సర్టిఫికెట్ కూడా డౌన్లోడ్ అయింది.దీంతో కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు.
ఇలా తాజాగా భద్రాద్రి కొత్తగూడెం మండలం న్యూగొల్లగూడేనికి చెందిన కొత్త మల్లారెడ్డి అలియాస్ మల్లయ్య ఈనెల 11న మృతిచెందారు. అయితే వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం మృతిచెందిన మల్లారెడ్డి అలియాస్ మల్లయ్యకు ఈనెల 16న అంటే చనిపోయిన ఐదు రోజులకు ప్రికాషనరీ డోస్ వ్యాక్సినేషన్ చేసినట్టు డాటా అప్లోడ్ చేసి సర్టిఫికెట్ ఇచ్చేశారు. మల్లారెడ్డి అలియాస్ మల్లయ్యకు మొదటి డోస్ కావ్యాక్సిన్ను 2021 ఏప్రిల్ 9 వ తేదీన, రెండో డోస్‌ను 2021 మే 10వ తేదీన వేసినట్టు రికార్డులు చెబుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను తట్టుకోడానికి గానూ అరవైయ్యేళ్లు నిండిన వృద్ధులకు ప్రికాషనరీ డోస్‌గా బూస్టర్‌డోస్‌ను వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో దాదాపు అన్ని చోట్లా కౌంటర్లు ఏర్పాటు చేసి మరీ వ్యాక్సినేషన్‌ను చేస్తున్నారు. దీనికోసం టార్గెట్లు పెట్టి మరీ అధికారులు మోనిటరింగ్ చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే ఈనెల 16వ తేదీన కొత్త మల్లారెడ్డి అలియాస్ మల్లన్నకు బూస్టర్ డోస్ వేసినట్టు పేర్కొన్నారు. 37121039ఏ బ్యాచ్‌కు చెందిన వ్యాక్సిన్ వైల్లో నుంచి ఆయనకు వ్యాక్సినేషన్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎన్.ఉమాదేవి పర్యవేక్షించినట్టు. ఆయనకు ఇచ్చిన సర్టిఫికెట్లో పేర్కొన్నారు. ఇలా చనిపోయిన వ్యక్తికి వ్యాక్సినేషన్ చేసినట్టు రికార్డులు రూపొందించడం వల్ల సంబంధిత శాఖ ఉద్యోగులకు వచ్చిన లాభం ఏంటన్నది అర్థం కాని ప్రశ్న. ఇది పొరబాటుగా జరిగిందా..? లేక టార్గెట్ కోసం గతంలో వేసిన ఆధార్ నంబర్లను ఫీడ్ చేస్తున్నారా అన్నది అర్థం కాని విషయం. ఇలా అసలు ఎన్ని వ్యాక్సిన్లు వేశారు. వాటిలో అసలు ఎన్ని.. ఇలాంటి లెక్కలు ఎన్ని అన్నది తేల్చలేని పరిస్థితి.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.