Covid Vaccine: ముందుగా తెలంగాణ ప్రజలకే కోవిడ్ టీకా.. మంత్రి ఈటల డిమాండ్

Corona updates: తెలంగాణ (Telangana) గడ్డ మీద తొలి వాక్సిన్ కొవాగ్జిన్ (Covaxin) తయారవుతున్నందున.. ముందుగా రాష్ట్ర ప్రజలకే ఇవ్వాలని కేంద్రాన్ని మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: November 27, 2020, 9:29 PM IST
Covid Vaccine: ముందుగా తెలంగాణ ప్రజలకే కోవిడ్ టీకా.. మంత్రి ఈటల డిమాండ్
ఈటల రాజేందర్
  • Share this:
భారత్‌లో పలు కరోనా వాక్సిన్ ప్రయోగాలు మూడో దశలో ఉన్నాయి. స్వదేశీ వాక్సిన్ కొవాగ్జిన్‌ (covaxin) మూడో దశ ప్రయోగాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇది విజయవంతమైతే అతి త్వరలోనే కొవాగ్జిన్ అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వాక్సిన్ అభివృద్ధి కేంద్రాలను సందర్శించనున్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్, పుణెలో వాక్సిన్ తయారీ కేంద్రాలకు వెళ్లి శాస్త్రవేత్తలతో సమీక్ష చేయనున్నారు ప్రధాని. ఈ క్రమంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డ మీద తొలి వాక్సిన్ తయారవుతున్నందున.. ముందుగా రాష్ట్ర ప్రజలకే ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

''ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం గర్వకారణం.  తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి ఆ ఫలితం  ఇక్కడి ప్రజలకు ముందుగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని వాక్సిన్ డోస్‌లు ఇవ్వాలని కోరుతున్నాం. కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాబట్టి  ప్రజలందరికీ అతిత్వరలో వాక్సిన్ అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ నీ కోరుతున్నాం. '' అని ఒక ప్రకటనలో ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

మనదేశంలో మూడు వాక్సిన్‌లు ప్రస్తుతం మూడో దశ ప్రయోగాల్లో ఉన్నాయి. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ (Bharat biotech) కంపెనీ కొవాక్జిన్ (Covaxin), అహ్మదాబాద్‌కు చెందిన జైడుస్ క్యాడిల్లా కంపెనీ జైకోవ్-డీ (ZyCoV-D) వాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఇక పుణెకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకొని.. భారత్‌లో ఆస్ట్రజెనికా-ఆక్స్‌ఫర్డ్ ( AstraZeneca-Oxford) వాక్సిన్‌ను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూడు నగరాల్లో శనివారం పర్యటించబోతున్నారు ప్రధాని మోదీ.


కాగా, గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కొత్తగా 761 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. రాష్ట్రంలో కొత్తగా 42,242 కరోనా టెస్టులు నిర్వహించారు. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 53,32,150కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య సంఖ్య 1,448కి చేరింది. కరోనా బారిన నుంచి కొత్తగా 702 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,55,378కి చేరుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 10,839 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 8,651 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: November 27, 2020, 9:15 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading