సింగరేణిలోని పలు గనులను వేలం వేయడంపై కేంద్రం పార్లమెంట్లో వివరణ ఇచ్చింది. ఈ అంశంపై తెలంగాణకు చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేయడంపై స్పందించింది. సింగరేణి సంస్థలో(Singareni) కేంద్రం, తెలంగాణకు ఉమ్మడి ఓనర్షిప్ ఉందని కేందమంత్రి ప్రహ్లాట్ జోషి (Prahlad Joshi) అన్నారు. తెలంగాణకు(Telangana) సింగరేణిలో 51 శాతం వాటా ఉందని ఆయన గుర్తు చేశారు. గనుల వేలం ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదని ఆయన అన్నారు. ఈ మొత్తం ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నామని తెలిపారు. దీనికి అంగీకరిస్తే తెలంగాణ ప్రభుత్వానికి కూడా ప్రయోజనం ఉంటుందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు.
ఈ విషయంలో జార్ఖండ్, చత్తీస్గఢ్ సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహకరిస్తున్నాయని.. వేలం ద్వారా వచ్చే రెవెన్యూ అంతా రాష్ట్ర ప్రభుత్వాలకే వెళుతుందని చెప్పారు. కోల్స్కామ్లో ఉన్నవాళ్లే పారదర్శకంగా జరుగుతున్న ఈ వేలాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు సింగరేణిలో కేంద్రం వాటాను బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం కొంటామని అడిగినా.. తమ ప్రతిపాదనలను కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇది తీవ్రమైన సమస్య అని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఆ గనుల వేలం ప్రక్రియను ఆపాలని.. వాటిని తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల TRS కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్ ..వైద్య కళాశాలకు భూమి పూజ
Karimnagar: నేడే జగిత్యాలకు సీఎం కెసిఆర్ రాక..పర్యటనను అడ్డుకోవాలని కాంగ్రెస్ నాయకుల పిలుపు
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని.. అందులో భాగంగానే సింగరేణిలోని వాటాను కూడా విక్రయిస్తోందని మరో ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. ఇక గత 20 ఏళ్ల నుంచి లాభాల్లో ఉన్న సింగరేణిలోని గనులను వేలం వేయడాన్ని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పుబట్టారు. ఇటీవల తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీ తాము సింగరేణిని ప్రైవేటీకరించబోమని అన్నారని.. కానీ జరుగుతున్నది మాత్రం అందుకు భిన్నంగా ఉందని ఆయన ఆరోపించారు. వెంటనే సింగరేణి గనుల వేలం విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.