Home /News /telangana /

CENTRE MINISTER KISHAN REDDY ALLEGES SECUNDERABAD RAILWAY STATION VIOLENCE WILL BE CONSPIRACY AK

Kishan Reddy: పథకం ప్రకారమే సికింద్రాబాద్ ఘటన.. రాష్ట్రం ఏం చేస్తోందన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

కిషన్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Kishan Reddy on Agnipath: చాలా దేశాల్లో ఇలాంటి విధానాన్ని పరిశీలించిన తరువాతే అగ్నిపథ్‌ను తీసుకొచ్చామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

    సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన హింసాత్మక ఘటన దురదృష్టకరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. అయితే ఈ ఘటన పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. ఉదయం నుంచి ఆందోళనకారులు ధర్నా చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయించిన రాష్ట్రం ప్రభుత్వం.. ఈ రకమైన ఘటనలపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రెండు రోజుల నుంచి సోషల్ మీడియా (Social Media) ద్వారా సన్నద్ధమవుతూ.. రైల్వేస్టేషన్‌ను టార్గెట్‌గా చేసుకుని విధ్వంసం సృష్టించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. పలు రైళ్లకు(Trains) నిప్పు పెట్టడం.. స్టేషన్ సమీపంలోని 40 మోటర్ సైకిళ్లు కాల్చేశారని అన్నారు. చుట్టుపక్కల షాపులు లూటీ చేశారని అన్నారు.

    శాంతిభద్రతలు రాష్ట్రం చేతుల్లో ఉంటాయన్న కిషన్ రెడ్డి.. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. నిన్న రాజ్ భవన్ ముందు స్కూటర్ కాల్చేశారని.. శాంతిభద్రతలు ఏ విధంగా ఉన్నాయో వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. ఏదైనా అంశం ఉంటే చర్చించేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. గతంలో రైతు చట్టాలపై అనేకసార్లు రైతు సంఘాలతో చర్చించామని గుర్తు చేశారు.

    అగ్నిపథ్‌పై ప్రకటన చేసి కనీసం రెండు రోజులు కూడా కాలేదని.. రెండు రోజుల్లోనే ఈ రకమైన హింస చెలరేగడం మంచిది కాదని కిషన్ రెడ్డి అన్నారు. చాలా దేశాల్లో ఇలాంటి విధానాన్ని పరిశీలించిన తరువాతే అగ్నిపథ్‌ను తీసుకొచ్చామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు, యువతలో దేశభక్తి, నైపుణ్యం పెంచే ప్రయత్నమే ఇదే. అగ్నిపథ్‌ యువతకు వ్యతిరేకం కాదని అన్నారు.

    Agnipath Row : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంసంతో నష్టం ఎంతంటే.. తెలంగాణ అంతా టెన్షన్

    Jobs in Telangana: నిరుద్యోగులకు అలర్ట్.. బీబీనగర్ ఎయిమ్స్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్

    అగ్నిపథ్ నియామక విధానంపై కేంద్రం ప్రకటన ఏకపక్ష నిర్ణయం కాదని, ప్రపంచదేశాల్లో పరిస్థితులన్నీ పరిశీలించిన మీదటే తీసుకున్న నిర్ణయం అని ఉద్ఘాటించారు. అగ్నిపథ్ పై రాష్ట్ర ప్రభుత్వాలతోనూ మాట్లాడామని వివరించారు. తాజాగా అగ్నిపథ్ లో గరిష్ఠ వయోపరిమితి 23 ఏళ్లకు పెంచామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Agnipath Protest, Agnipath Scheme, Kishan Reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు