Home /News /telangana /

CENTRAL MINISTER KISHANREDDY WRITES A LETTER TO CM KCR ON RAILWAY PROJECTS VRY

KishKishan reddy : మీ వల్లే ఆలస్యం.. సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

kishan reddy file pic

kishan reddy file pic

Kishan reddy : రాష్ట్ర వైఖరి వల్లె రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యం అవుతున్నాయంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఈ సంధర్భంగా కేంద్రంపై ఆరోపణలు చేయడంపై ఆయన మండిపడ్డారు.

    తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టుల విషయంలో టీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేరుగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు ఆ లేఖలో కేంద్రం కేటాయించిన నిధులను ఆయన వివరించారు. గతంలో కేటాయించి ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరించడం వల్లే ప్రాజెక్టుల నిర్మాణం ఆలస్యమవుతుందని , మరోవైపు కొత్త ప్రాజెక్టులు కూడా రావడం లేదని పేర్కోన్నారు. ఈ సంధర్భంగా గత ఏడు సంవత్సరాల్లో తెలంగాణకు 250 కోట్లు ఉన్న రైల్వే బడ్జెట్ 2450 కోట్లకు పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. గతంతో పోలీస్తే తొమ్మిది రెట్లు అదనంగా నిధులు పెరిగాయని చెప్పారు..

    రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన రైల్వే ప్రాజెక్టులకు భూ కేటాయింపు జరిగినట్టయితే త్వరిత గతిన ప్రాజెక్టులు పూర్తవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో ఏడేళ్లలో రైల్వే నెట్‌వర్క్‌ 194 రూట్ కిలోమీటర్లు అంటే 356 ట్రాక్‌ కిలోమీటర్లు పెరిగిందని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ సంధర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న పలు ప్రాజెక్టుల వివరాలను ఆయన పొందు పరిచారు.

    Hyderabad : పెళ్లి కావడం లేదని పురోహితుడి వద్దకు వెళితే.. తానే పెళ్లి చేసుకుంటానని..

    వాటిలో ముఖ్యంగా మనోహారబాద్-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లను ఇవ్వడంతోపాటు 342 హెక్టార్ల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాల్సి ఉందని తెలిపారు.ఇక ఎమ్ఎమ్‌టీఎస్ 2 కూడా రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన అంచనాల ప్రకారం 760 కోట్లు జమ చేయాలని పేర్కోన్నారు. ఇలా రాష్ట్రంలోని పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల్లో రాష్ట్రవాటలు పెండింగ్‌లో ఉండడం వల్లే ఆ పాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ నేతలు ఆరోపణలు మానుకుని ప్రాజెక్టుకు కేటాయించవల్సిన భూమితో పాటు డబ్బులు కేటాయించాలని ఆయన సీఎం కోరారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Kishan Reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు