CENTRAL MINISTER KISHAN REDDY COUNTER ATTACK TO CM KCR COMMENTS ON PADDY VRY
Kishan reddy : ధర్నాలు, నాలుకలు చీలుస్తామంటే భయపడేవారు ఎవరు లేరు.. సీఎం వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి కౌంటర్.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైల్ ఫోటో
Kishan reddy : వరి కొనుగోలుపై తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. దేశంలో పంజాబ్ తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా బియ్యాన్ని సేకరిస్తున్నామని ఆయన వివరించారు.. సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
వరి కోనుగోలుపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది. ఈ క్రమంలోనే సీఎం కేసిఆర్ చేస్తున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మీడియా సమావేశంలో ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వరి పంటతో పాటు ఇతర అంశాలపై సరైన అవగాహాన లేకుండా భాద్యతరాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండి పడ్డారు. దీంతో అధికారులు, ప్రజా ప్రతినిధులు వేర్వేరుగా మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వరి పంట ఎంత సాగు అవుతుంది అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి క్లారీటి లేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి యూపిఏ ప్రభుత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు ఉన్న దాన్ని 26 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టి బియ్యం కోనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. కాగా ఇది దేశంలోని పంజాబ్ రాష్ట్రం తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా కొనుగులు చేస్తున్నామని చెప్పారు.ఇక ధర్నాలు చేస్తామంటూ.. నాలుకలు చీలుస్తామంటే భయపడే పరిస్థితి లేదని అన్నారు. ఇక చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు.
పెట్రోల్ డీజిల్ పై వివరణ
పెట్రోల్ డీజిల్‌పై పెంచిన ధరలతో ప్రజలపై భారం పడుతుందనే ఉద్దేశ్యంతోనే ట్యాక్సిలు తగ్గించామని అదే తరుణంలో ఆయా రాష్ట్రాలను కూడా కోంతమేర తగ్గించాలని కొరామని చెప్పారు. దీనికి ఇంత బాధ ఎందుకని అన్నారు. దీనికి కేంద్రం దోచుకుంటుందని ప్రచారం చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రం ధరలు పెంచి ఫాం హౌజ్‌ల్లో దాచుకుంటున్నామని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా 2015లో పెంచిన ట్యాక్స్‌లను ఆయన ప్రస్థావించారు. ఇప్పటికైనా సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఇక రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదన్న సీఎం వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం లేకుండా బీబీనగర్ కు ఎయిమ్స్ ఎలా వచ్చిందని చెప్పారు. 2016 లో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో కొత్త కాలేజీల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస బాధ్యతగా స్పందించలేదని అని వివరించారు. కనీసం మంత్రులు కాని, సీఎం కాని కేంద్రంతో చర్చించారా అని ఆయన ప్రశ్నించారు.
కాగా గత రెండు రోజులుగా సీఎం కేసీఆర్ ,బీజేపీ నేతల మధ్య బియ్యం కొనుగోలుపై ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా సీఎం కేసీఆర్ టార్గెట్ చేయడంతో ఆయన నేడు ఢిల్లీలో స్పందిచారు. దీంతో కేంద్రం చేస్తున్న పలు అభివృద్ది పనులతో పాటు రాష్ట్ర ప్ఱభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగంట్టారు.
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.