హోమ్ /వార్తలు /తెలంగాణ /

Kishan reddy : వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటి..

Kishan reddy : వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి క్లారిటి..

కిషన్ రెడ్డి ఫైల్ ఫోటో

కిషన్ రెడ్డి ఫైల్ ఫోటో

Kishanreddy : వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మరోసారి స్పష్టత ఇచ్చారు.. వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్రం ఎక్కడైనా చెప్పిందా అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి ఆయన ఫైర్ అయ్యారు.

వరి ధాన్యంపై కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రవైఖరికి వ్యతిరేకంగా ధార్నాలు చేసిన విషయం తెలిసిందే.. కాగా ధాన్యం కొనుగోలుపై ఇరు ప్రభుత్వాలు విమర్శలు ఎక్కుపెట్టుకున్నారు. దీంతో ఇరు పార్టీలు ధర్నాలు చేశారు. ఈ క్రమంలోనే వరి కొనుగోలుపై కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. హైదారాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన వరి ధాన్యం కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా చెప్పిందా అని ప్రశ్నించారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు చేసే బదులు ఉద్యోగాల భర్తీ, ఆయుష్మాన్‌ భారత్‌, ఎస్సీలకు మూడెకరాల భూమి పంపిణీపై దృష్టి పెట్టాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వకుండా ఒక్క హుజూరాబాద్‌కే ఎందుకు పరిమితం చేశారని ప్రశ్నించారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇది చదవండి : నన్ను ఎందుకు పిలవలేదు..? ఏఐసీసీకి లేఖ రాసిన జగ్గారెడ్డి..


తెలంగాణలో ఏ రైతు అయినా బాయిల్డ్‌ రైస్‌ ఉత్పత్తి చేస్తున్నారా? బాయిల్డ్‌ రైస్‌ అనేది రైస్‌ మిల్లర్ల సమస్య. దశలవారీగా బాయిల్డ్‌ రైస్‌ తగ్గించాలని కేంద్రం చెబుతూ వస్తుందని అన్నారు... రైస్‌ మిల్లర్లతో మాట్లాడకుండా రైతులను, కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం బద్నాం చేస్తోందని ఫైర్ అయ్యారు..

ఇక ధర్నా చౌక్‌ వద్దు అన్న వాళ్లే ధర్నా చేశారని ఎద్దేవా చేశారు.. అధికారంలో ఉన్న మంత్రులు కూడా ధర్నా చేయడం చాలా సంతోషం. మంత్రులు ధర్నా చేసి నాకు ఆదర్శంగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని విమర్శించడానికి నోరెలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు... అబద్దాల ప్రచారం మీద ప్రభుత్వాలు నడపొద్దని హితవు పలికారు... మోదీ ప్రభుత్వం ఎక్కడా అప్పులు చేసి కమీషన్లు తీసుకోలేదని ఈ సంధర్భంగా స్పష్టం చేశారు...

ఇది చదవండి : నలుగురు పిల్లలు ఉన్నా.... ప్రియుడితో ఉంటానంటూ.. మహిళ ఫిర్యాదు..


రామప్పకు యునెస్కో గుర్తింపు తేవడానికి కేంద్రం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. ప్రగతి భవన్‌లో పడుకొని 19 దేశాలను ఒప్పించావా కేసీఆర్‌ అంటూ ప్రశ్నించారు.. వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్రాలను ప్రతిపాదనలు కోరామని ... మెడికల్‌ కాలేజీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ఆయన అన్నారు.. కేంద్రం ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని తెరాస అంటోందని.. బీబీ నగర్‌ ఎయిమ్స్‌ తెలంగాణలో లేదా అని ప్రశ్నించారు..

First published:

Tags: Kishan Reddy, PADDY PROCUREMENT, Telangana

ఉత్తమ కథలు