హోమ్ /వార్తలు /తెలంగాణ /

AP-TS Fight: ఏపీ, తెలంగాణ మధ్య జలయుద్ధం.. రంగంలోకి కేంద్రమంత్రి.. సీఎం కేసీఆర్‌కు ఫోన్

AP-TS Fight: ఏపీ, తెలంగాణ మధ్య జలయుద్ధం.. రంగంలోకి కేంద్రమంత్రి.. సీఎం కేసీఆర్‌కు ఫోన్

కేసీఆర్, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

కేసీఆర్, వైఎస్ జగన్ (ఫైల్ ఫోటో)

శుక్రవారం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)తో కేంద్రమంద్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఫోన్‌లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ వివాదం, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది.

  ఏపీ, తెలంగాణ మధ్య జల యుద్ధం ముదురుతోంది. ఇరు రాష్ట్రాల మంత్రులు మాటల మంటలతో రచ్చ చేస్తున్నారు. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ తెలుగు రాజకీయాను వేడెక్కిస్తున్నారు. మీరేంటే మీరే దొంగలంటూ పరస్పరం పరస్పరం నిందించుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు నీటి కోసం దేనికైనా సిద్ధమనే తరహాలో దూకుడు మీదున్నాయి. ఈ తరుణంలో కేంద్రజలనవరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రంగంలోకి దిగారు. శుక్రవారం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR)తో ఫోన్‌లో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ వివాదం, జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఏపీ తీరును కేంద్రమంత్రి దృష్టికి తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. ఏపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతులు లేకుండా.. ఎన్టీజీ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడుతోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతిస్తోందని వాపోయారు. ఏపీ ఒకవేళ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపడితే తగిన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి సీఎం కేసీఆర్‌కు చెప్పినట్లు సమాచారం. ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతానికి కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు బృందాన్ని పంపిస్తామని.. అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయో ఆ కమిటీ పరిశీలిస్తుందని గజేంద్ర షెకావత్ చెప్పినట్లు తెలుస్తోంది. కమిటి నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారట.

  polavaram,centre on polavaram,notice to polavaram controctor,navayuga company,gajendra shekawat,పోలవరం,పోలవరం కాంట్రాక్ట్ రద్దు,పోలవరం కాంట్రాక్టర్‌కు నోటీసులు,ఏపీలో నిపుణుల కమిటీ,గజేంద్ర సింగ్ షెకావత్,
  కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (File)

  రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది. అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపడుతున్నారని.. తక్షణమే అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) నిబంధనలకు విరుద్ధంగా అక్కడ పనులు జరుతున్నాయని ఫొటోలును కూడా సమర్పించారు. తాజాగా మరోసారి తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేఖరాశారు. ఎన్టీజీ ఆదేశాలను అమలు చేయడంలో బోర్డు విఫలమయిందని వాపోయారు. తక్షణం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.

  మరోవైపు ఏపీ తీరుపై NGT కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతామని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హెచ్చరించింది. పర్యావరణ అనుమతులు లేనిదే రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుు వెళ్లొద్దని గతంలోనే పలుమార్లు ఎన్జీటీ ఆదేశించింది. ఐనా వాటిని పట్టించుకోకుండా నిర్మాణాలను చేపడుతున్నారని.. తెలంగాణకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్టీజీలో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై శుక్రవారం ఎన్టీజీ చెన్నై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాల్సిందిగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుతో పాటు చెన్నైలోని కేంద్ర పర్యావరణ ప్రాంతీయ కార్యాలయానికి ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది.

  కాగా, కృష్ణా నదిపై కొత్త ఆనకట్ట నిర్మాణం సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం జలాశయం ఎగువన కృష్ణా నదిలో తుంగభద్ర కలిసే ముందు గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు పరిధిలో ఆనకట్ట నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టింది. కృష్ణా నదిలో 35 నుంచి 40 టీఎంసీలు నిల్వ చేసేలా జోగులాంబ బ్యారేజ్ నిర్మించనున్నారు. తద్వారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్బాగమయిన ఏదుల రిజర్వాయర్‌కు ఎత్తిపోసి, పాలమూరు కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Andhra Pradesh, Krishna River, Krishna River Management Board, Telangana

  ఉత్తమ కథలు