హోమ్ /వార్తలు /తెలంగాణ /

GHMC Elections Results 2020: జీహెచ్ఎంసీ ఫలితాలపై అమిత్ షా ట్వీట్

GHMC Elections Results 2020: జీహెచ్ఎంసీ ఫలితాలపై అమిత్ షా ట్వీట్

అమిత్ షా (ఫైల్)

అమిత్ షా (ఫైల్)

GHMC Elections Results 2020: జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఊహించని ఫలితాలను సాధించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఆ పార్టీ అగ్ర నాయకుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు.

  • News18
  • Last Updated :

GHMC ఎన్నికలలో అనూహ్య ఫలితాలు సాధించి.. టీఆర్ఎస్ ను నిలువరించిన బీజేపీకి అగ్ర నాయకత్వం నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా ఎన్నికలలో కమలం పార్టీ అనూహ్యంగా 47 స్థానాల్లో విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. మేయర్ పీఠం గెలవకున్నా.. టీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చాటుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో అద్భుత ప్రదర్శన కనబరిచారని ఆయన కొనియాడారు.

ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ... ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారధ్యంలో, అభివృద్ధి లక్ష్యంగా సాగిస్తున్న బిజెపి రాజకీయాలపై విశ్వాసం ఉంచిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. బీజేపీ కార్యకర్తల కృషి మరువరాదని కొనియాడారు.


బల్దియా ఎన్నికల్లో ఊహించిన ఫలితాలు సాధించిన తర్వాత ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ స్పందిస్తూ.. ఇక నుంచి రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా ఇవే ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విజయం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల విజయమని అన్నారు. ఎన్నికల సందర్భంగా తమ పార్టీకి చెందిన కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని.. అయినా పట్టుదలగా పార్టీ విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

First published:

Tags: Amit Shah, Bandi sanjay, GHMC, GHMC Election Result, Hyderabad, Hyderabad - GHMC Elections 2020, JP Nadda, Pm modi

ఉత్తమ కథలు