CENTRAL HOME MINISTER AMIT SHAH AMIT SHAH ADDRESS MEETING NIRMAL SEPTEMBER 17 ADB VB
Telangana News: దారుణ ఘటన.. ఒక్క మర్రిచెట్టుకు.. వెయ్యి మంది ఉరితీత.. అసలు ఆరోజు ఏం జరిగింది..
మర్రిచెట్టు
Telangana News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు గోండు రాజుల ఖిల్లా. పచ్చని అడవులు పర్చుకున్న ఈ ప్రాంతానికి 1857లో జరిగిన ప్రథమ స్వతంత్ర సంగ్రామంలోనే పాల్గొన్న ఘనత ఉంది. ఉత్తర భారతదేశంలో మొదలైన ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా అక్కడి వీరులు పోరుసల్పారు. అయతే ప్రస్తుతం అక్కడికి హోమంత్రి పర్యటించనున్న నేపథ్యంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒకప్పుడు గోండు రాజుల ఖిల్లా. పచ్చని అడవులు పర్చుకున్న ఈ ప్రాంతానికి 1857లో జరిగిన ప్రథమ స్వతంత్ర సంగ్రామంలోనే పాల్గొన్న ఘనత ఉంది. ఉత్తర భారతదేశంలో మొదలైన ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా అక్కడి వీరులు పోరుసల్పారు. ఈ క్రమంలో 1860లో వెలుగులోకి వచ్చిన ధీరుడు రాంజీగోండు. గోండు రాజుల వంశానికి చెందిన రాంజీ తొలి స్వాతంత్ర్య పోరాటాన్ని మన ప్రాంతంలో కొనసాగించాలని పిలుపునిచ్చాడు.
దేశమంతా విస్తరిస్తున్న ఆంగ్లేయులను, స్థానికంగా దోచుకుంటున్న హైదరాబాద్ నవాబులను ఏకకాలంలో ఎదుర్కోవాలని సమరశంఖం పూరించాడు. ఇందుకు గోదావరి తీరంలో చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకుని నెలల తరబడి పోరు సాగించారు.
అప్పటి నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం, ఆంగ్లేయ బలగాలు గోండులపై దాడులకు పాల్పడగా వాళ్లనూ గిరిబిడ్డలు వీరోచితంగా ఎదుర్కొన్నారు. ఎంతటి బలగాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలున్నా, రాంజీగోండు శత్రువులను ముప్పతిప్పలు పెట్టారు. కొండలు, గుట్టలు, అడవులను ఆసరాగా చేసుకుంటూ గెరిల్లా తరహా పోరు చేశారు. చివరకు దొంగ దెబ్బతో శత్రువులు వీరిని పట్టుకున్నారు. నిర్మల్ నుంచి ఎల్లపెల్లికి వెళ్లే మార్గంలో గల మహా మర్రిచెట్టుకు రాంజీగోండుతో పాటు వెయ్యిమంది వీరులను ఉరితీశారు.
నిమ్మరాజులు పాలించిన నిర్మల్ పట్టణం గుట్టలు, చెరువులు, బురుజులు, కొయ్యబొమ్మలే కాదు, సాహసో పేతమైన వీరుల త్యాగాల చరిత్రకు సజీవసాక్ష్యం. నాటి స్వాతంత్య్ర సంగ్రామానికి పునాదులు వేసి, ఎందరో వీరుల్లో స్ఫూర్తి నింపి పోరాటంలో భాగమైన పోరుగడ్డపై రోహిల్లా దండు తోడుగా గోండు వీరుల అండతో రాంజీ గోండు సాగించిన పోరాటం అసామాన్యమైనదని ఇక్కడ స్థానికులు తెలుపుతారు.
శత్రువు చేతికి చిక్కినా బెదరకుండా మాతృభూమి కోసం ఒకేసారి వెయ్యిమంది ఉరికొయ్యలను ముద్దాడిన ఘనత నిర్మల్ గడ్డది. ఇదే స్ఫూర్తిని నవాబుపై పోరాడి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన పోరాటం చరిత్ర పుటల్లోకి ఎక్కలేదు. దేశ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలోనే ఎక్కడా ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదు. 1919 ఏప్రిల్ 13న పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్ జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ సైన్యం వెయ్యిమందికి పైగా కాల్చి చంపిన ఘటనకు 50 ఏళ్ల ముందే నిర్మల్ గడ్డపై ఓ కీలక సంగ్రామ ఘట్టం చోటు చేసుకుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఒకేసారి వెయ్యిమంది వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారు.
నేలపైకి ఊడలు దిగిన మర్రిచెట్టుకు వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీసిన ఆ ఘటన నిర్మల్ లో జరిగింది. వెయ్యిమంది వీరుల బలిదానానికి సజీవ సాక్ష్యమైన మహా మర్రిచెట్టుకు వెయ్యి ఉరుల మర్రిగా పేరొచ్చింది. ఎల్లపెల్లి వెళ్లే దారిలో ఉండగా కొన్నేళ్ల క్రితం ఆ మర్రిచెట్టు గాలివానకు నేలకొరిగింది. అయితే తెలంగాణ ఉద్యమం వచ్చాక పలు సంఘాల నాయకులు 2007 నవంబర్ 14న వెయ్యి ఉరుల మర్రి సమీపంలో ఓ స్థూపాన్ని నిర్మించారు.
2008 నవంబర్ 14న నిర్మల్ పట్టణంలోని చైన్ గేట్ వద్ద రాంజీ గోండు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే రాంజీ గోండు పేరిట మ్యూజియం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వాలు ఇచ్చిన హామీ ఆచరణకు నోచుకోకపోగా, నాటి వీరులు గాథలు, వారి అసమాన ప్రాణత్యాగాల గురించి పట్టించుకునే వారు లేకుండా పోయారన్న వాదనలు ఉన్నాయి.
కాగా ఈ నెల 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి తలబెట్టిన బహిరంగ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తున్న క్రమంలో ఈసారి తెలంగాణ విమోచన దినోత్సవ రోజుకు ప్రాధాన్యత ఏర్పడింది. పట్టించుకోకపోవడం విడ్డూరం. సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అమీత్ షా నిర్మల్ పర్యటనలో ఏ ప్రకటన చేస్తారో వేచిచూడాలి. మరోవైపు అమీత్ షా పర్యటన విజయవంతానికి బిజెపి పార్టీ శ్రేణులు కసరత్తు చేయగా, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.