హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: హైదరాబాద్ ఘటనపై కేంద్రం సీరియస్.. సీఎం పర్యటనలో అలా జరగడంపై ఆగ్రహం

Hyderabad: హైదరాబాద్ ఘటనపై కేంద్రం సీరియస్.. సీఎం పర్యటనలో అలా జరగడంపై ఆగ్రహం

స్టేజిపై మైక్ లాగేస్తున్న నందకిశోర్

స్టేజిపై మైక్ లాగేస్తున్న నందకిశోర్

Himanta Biswasharma: అస్సాం పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. శనివారం అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి.. తమ రాష్ట్ర సీఎం పర్యటనలో భద్రతా లోపం తలెత్తడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  గణేష్ నిమజ్జన వేడుకల (Ganesh Immersion) సమయంలో హైదరాబాద్‌లో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Assam CM Himanta Biswasharma) పర్యటన కాకా రేపిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడే సమయంలో టీఆర్ఎస్ నేత మైకు లాగేయడంపై రాజకీయ దుమారం రేపింది. టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఐతే తాజాగా ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. అసోం సీఎం హైదరాబాద్ పర్యటన (Assam CM Hyderabad Tour)లో భద్రతా లోపం తలెత్తడానికి సీరియస్‌గా తీసుకుంది.  సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన సీఎంకు ఆ స్థాయిలో భద్రత కల్పించడంపై విఫలమవడంపై తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పాల్గొన్న కార్యక్రమాన్ని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం, మైక్ లాగేసిన నందకిశోర్ కూడా అదే సమితి సభ్యుడు కావడంతో... పోలీసులు ఏ మాత్రం అనుమానించలేదు. ఉదయం నుంచి స్టేజి వద్దే ఉండడంతో అంతా సాధారణంగానే ఉందని భావించారు. కానీ హిమంత బిశ్వశర్మ ప్రసంగానికి ముందు ఊహించని విధంగా... మైకును లాగేశారు నందకిశోర్. ఈ ఘటనపై కేంద్రహోంశాఖ నివేదిక కోరడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

  అటు అస్సాం పోలీసులు కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. శనివారం అస్సాం డీజీపీ భాస్కర్ జ్యోతి తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి.. తమ రాష్ట్ర సీఎం పర్యటనలో భద్రతా లోపం తలెత్తడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే.. తమ ముఖ్యమంత్రి హైదరాబాద్ పర్యటన ఖరారైందని... అలాంటప్పుడు ఆయనకు పటిష్టమైన బందోబస్తు కల్పించడం ఎలా విఫలమయ్యారని ప్రశ్నించారు. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్రంలో పర్యటించినప్పుడు.. ఆయనకు సీఎం స్థాయి భద్రత కల్పించాల్సిన స్థానిక పోలీసులపై ఉంటుంది. కానీ అసోం సీఎం పర్యటనలో భద్రతా లోపం తలెత్తడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  శుక్రవారం హైదరాబాద్‌లో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పర్యటించిన విషయం తెలిసిందే. మొజాంజాహీ మార్కెట్‌లో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన స్టేజిపై ఉండగా సమితి నేత భగవంతరావు మాట్లాడుతున్న సమయంలో..నందకిశోర్ అనే వ్యక్తి మైకు లాగేశారు. హిమంత బిశ్వశర్మ ప్రసంగించబోతున్న సమయంలో ఆయన మైకు లాక్కొని.. కిందకు వంచేశారు. ఈ ఘటనలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నంద కిశోర్ టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత కావడంతో.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ తర్వాత పోలీసులు వచ్చి నందకిశోర్‌ను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రాజకీయ దుమారం రేగింది. వినాయకుడి నిమజ్జనానికి వచ్చి రాజకీయాలు ఎందుకు మాట్లాడారని..సీఎంను తిట్టడం వల్లే ప్రజలకు కోపం వచ్చిందని టీఆర్ఎస్ నేతలు అన్నారు. ఐనప్పటకీ ఇలా జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Hyderabad, Telangana

  ఉత్తమ కథలు