తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్... కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత...

తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది.

news18-telugu
Updated: December 4, 2019, 10:00 PM IST
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్... కేటీఆర్ వ్యాఖ్యల తర్వాత...
ఎయిమ్స్
  • Share this:
తెలంగాణకు ఎయిమ్స్ మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. తెలంగాణలోని బీబీ నగర్ వద్ద ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు దివంగత అరుణ్ జైట్లీ గతంలో ప్రకటించారు. దీనిపై అధికారికంగా కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణకు ఎయిమ్స్‌ను కేటాయించాలంటూ ఇటీవల రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీవెళ్లినప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ఇతరత్రా వైద్య సదుపాయాలను కోరారు. ఈ క్రమంలో తాజాగా ఎయిమ్స్‌పై కేంద్రం గెజిట్ జారీ చేసింది.

అయితే, తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలవకుండానే తిరిగి వచ్చిన తర్వాత మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం దక్షిణాదిమీద సవితతల్లి ప్రేమ చూపిస్తోందని, ఉత్తరాది మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల తర్వాతే ఈ గెజిట్ రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading