Home /News /telangana /

CENTRAL GOVT HAS GIVEN CLARITY ON PADDY PURCHASE IN TELANGANA VRY

Paddy purchase : ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్....?

మహిళా రైతు

మహిళా రైతు

Paddy purchase : తెలంగాణ ధాన్యం కొనుగోలుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో వలే యధావిధిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేంద్ర అధికారులు ప్రకటించారు. దీంతో ధాన్యం కొనుగోళ్లపై ఉత్కంఠకు తెరపడినట్టయింది.

    తెలంగాణలో ( Telangana ) ధాన్యం కొనుగోళ్ల సస్పెన్స్‌కు కేంద్రం ఫుల్‌స్టాప్ పెట్టింది. ( Paddy purchase )ఎప్పటిలాగే ధాన్యం కొనుగోళ్లు చేస్తామని కేంద్ర అధికారులు ప్రకటించారు. ధాన్యానికి గతంలో నిర్ణయించిన మద్దతు ధరకు కొనుగోలు జరుగుతాయని స్పష్టం చేశారు.
    ఇటివలే రాష్ట్ర బృందం సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు ఢిల్లీ ( Delhi ) వెళ్లిన విషయం తెలిసిందే.. అయితే అప్పుడు ఎలాంటీ క్లారీటి ఇవ్వని కేంద్రం యాసంగిలో ధాన్యం కొనుగోళ్లు చేయమని స్పష్టం చేశారు. ( Paddy purchase )అదికూ ఎప్పుడు ఎంత ధాన్యం కొంటారో ముందుగా నిర్ణయించి చెప్పలేమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పంటల ఉత్పత్తి వచ్చిన తర్వాతే దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

    దీంతో రాష్ట్ర బృందం నిరాశతోనే వెనుదిరిగింది. ( telangana ) కేంద్ర నిర్ణయంతో భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్న సంధర్భంలోనే కేంద్రం ధాన్యం కొనుగోళ్లపై ఓ ప్రకటన చేసింది. అయితే కేంద్రం ప్రకటనపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం డిమాండ్ చేస్తున్నట్టుగా యాసంగి ధాన్యం కొంటారా లేక ప్రస్తుతం వానకాలం పంటకు మాత్రమే పరిమితం అవుతారా అనేది స్పష్టం చేయాల్సిన అవరసం ఉంది. దీంతో పాటు ప్రస్తుత వానాకాలం సీజన్‌లో కూడా ఏ మేరకు కొనుగోలు చేస్తారో అని తేలాల్సి ఉంది.

    BJP : ఇది నిజమా..? బీజేపీ సంచనల కామెంట్స్ .. 25 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు..


    తరుణ్ చుగ్


    Adilabad mlc : ఒక్కరు విరమించుకుంటే ఏకగ్రీవమే... కాని ఆ ఒక్క మహిళతో ఉద్రిక్తత.. పోలీసుల ఎంటర్


    రాష్ట్ర బృందం తరిగి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎలాంటీ కార్యచరణపై ముందుకు రాలేదు.. కేంద్రం నిర్ణయం తర్వాతే ప్రకటిస్తామని చెప్పిన సీఎం డిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కొంత మౌనం పాటిస్తున్నారు. అంతకు ముందు ఢీల్లీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సీఎం తాజాగా మాత్రం మౌనంగా కనిపిస్తున్నారు. అయితే అది ఆయన వ్యుహాత్మక మౌనంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నారు. ఇప్పుడు తాజాగా కేంద్రం ప్రకటనతో ఎలాంటి రియాక్షన్ ఉంటుందో వేచి చూడాలి.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Delhi, PADDY PROCUREMENT, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు