Home /News /telangana /

CENTRAL GOVERNMENT GAVE CLARITY ON PADDY PURCHASE VRY

Central on paddy : సీఎం కేసిఆర్ అల్టిమేటంకు కేంద్రం సమాధానం..ఇదే.. బాయిల్డ్ రైస్ పై స్పష్టత

మహధర్నాలో సీఎం కేసిఆర్

మహధర్నాలో సీఎం కేసిఆర్

Central on paddy : వరి ధాన్యం కోనుగోలుపై సీఎం కేసిఆర్ అల్టిమేటం ఇచ్చిన కొద్ది సమయానికే కేంద్ర ప్రభుత్వం అనధికార ప్రకటనతో ఓ స్పష్టతనిచ్చింది. రానున్న యాసంగీలో ఎట్టి పరిస్థితుల్లో బాయిల్డ్ రైస్ కొనబోమని స్పష్టం చేసింది. అయితే రా రైస్ కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు.

ఇంకా చదవండి ...
    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వరి యుద్దం తీవ్రమవుతోంది. ఓ వైపు ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ధర్నాలు ,ఆందోళనలు చేస్తుండగా అంతే వేగంగా కేంద్రం కూడా నిర్ణయాలు తీసుకుంటుంది, ఈక్రమంలోనే కేంద్రంపై యుద్దాన్ని ప్రకటించిన సీఎం కేసిఆర్ కేంద్రానికి వార్నింగ్ ఇచ్చారు. రెండు రోజుల పాటు సమయం ఇచ్చారు. రెండు రోజుల్లో ధాన్యం కొంటారా లేదా అని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇక ప్రతి గ్రామంలో చావు డప్పు మోగించడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర వైఖరి వల్ల దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇందుకోసం ఆయన మూడు గంటల పాటు ధర్నా నిర్వహించారు.

    అయితే సీఎం కేసిఆర్ డిమాండ్ చేసిన కొద్ది సేపటికే ఢిల్లీ ప్రభుత్వం పావులు కదిపింది. సీఎం కేసీఆర్ లేవనెత్తిన డిమాండ్ పై ప్రభుత్వ అధికారులు స్పందించారు. ఈ క్రమంలోనే రానున్న వేసవిలో ఎట్టి పరిస్థితుల్లో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని చెప్పారు. అయితే ఖచ్చితంగా రా రైస్ కొంటామని చెప్పారు. ఇదే అంశంపై గతంలో కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలకు జారీ చేశామని వివరించారు. బాయిల్డ్ రైస్‌ను దేశంలోని రెండు రాష్ట్రాల్లోమాత్రమే వినియోగం ఉందని, ఇప్పుడు ఆ రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసుకుంటున్నాయని వివరించారు. దీంతో ఇప్పటికే లక్షల టన్నుల్లో బాయిల్డ్ రైస్‌ నిల్వలు కేంద్రం వద్ద ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలోనే బాయిల్డ్ రైస్ మినహా మిగతా రా రైస్‌ను కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నామని చెప్పారు.

    ఇది చదవండి : వరిపై కాంగ్రెస్... రాష్ట్రానికి వ్యతిరేకంగా ర్యాలీ.. టీఆర్ఎస్, బీజేపీలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాడ్డాయి...


    ఇక సీఎం కేసిఆర్ చేసిన మరో విమర్శకు కూడా అధికారులు సమాధానం చెప్పారు. పంజాబ్‌లో కొనుగోలు చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరని ఆయన ప్రశ్నంచడంతో అధికారులు వివరణ ఇచ్చారు. పంజాబ్‌లో వరి పంట తక్కువగా ఉత్పత్తి అవుతుందని అందుకే అక్కడ 90 శాతం కొనుగోళ్లు చేస్తున్నామని వివరించారు. కాని తెలంగాణలో ఊహించిదాని కంటే అదనంగా 27 శాతం వరి ఉత్పత్తి పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

    సో మొత్తం మీద వరి కొనుగోలుపై అనధికారికంగా మరోసారి కేంద్రం స్పష్టం చేయడంతో ఇక సీఎం కేసిఆర్ భవిష్యత్ కార్యచరణ ఏలా ఉంటుందో వేచి చూడాలి. మరోవైపు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ తోపాటు వరి పంటను వేసుకునే విధంగా రైతులకు చెబుతున్నారు. దీంతో రెండు పార్టీలతో పాటు అటు ప్రభుత్వాల పరంగా కూడా ఉత్కంఠ నెలకొంది. మరి ఈ పరిణామాలపై రానున్న రోజుల్లో రాష్ట్ర సీఎం ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. మరోవైపు ఇప్పటికిప్పుడు బాయిల్డ్ రైస్ మిల్లులను రా రైస్ మిల్లులుగా మార్చడం అనేది కష్టసాధ్యమే .. దీంతో రైతులు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు పడే అవకాశాలే కనిపిస్తున్నాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, PADDY PROCUREMENT, Telangana

    తదుపరి వార్తలు