V. Hanumantha Rao: కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం.. కరోనా బాధితులు శ్మశానాల్లో తలదాచుకోవండం బాధాకరం..

మీడియాతో మాట్లాడుతున్న వీహెచ్

V.Hanumantha Rao: అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కరోనా తో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా కరోనాను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు విమర్శించారు. కనీసం ప్రజలకు ఇసోలేషన్ కేంద్రాలు లేక కరోనా సోకిన ప్రజలు మహబూబ్ నగర్ లో శ్మశానవాటికలో తలదాచుకోవడం తనను ఎంతో కలచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Share this:
    మోడీ, కేసీఆర్ ప్రభుత్వాలకు ఎలక్షన్స్ మీద ఉన్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై లేదని, దేశంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కరోనా సోకి ఇబ్బందులు పడుతున్నా కనీసం ఇసొలేషన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయలేక పోవడం బాధాకరమని అన్నారు. సోమవారం ఆయన బాగ్అంబర్ పేట లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. భారత్ లో తయారు చేసిన రెండు వాక్సిన్ లు తను స్వయంగా ప్రపంచ దేశాల ప్రజల రక్షణకు అన్ని మీడియా ముందు నీతులు చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ ముందు మన దేశ ప్రజల కోసం వాక్సిన్ అందుబాటులో పూర్తిగా వైఫల్యం చెందాడని, మన దేశంలో ఉత్పత్తి ఆయన వాక్సిన్ లు ఇతర దేశాలకు వెళ్తున్నా ఏమి చేయాలని స్థితిలో మోడీ ఉన్నరాని, ఆయన ముందే వాక్సిన్ ఉత్పత్తిదారులకు మన భారత దేశ ప్రజలకు సరిపోయే వాక్సిన్ కోసం ఆర్డర్ ఇచ్చిఉంటే ఈరోజు మన రాష్ట్ర, దేశ ప్రజలకు ఈ దుస్థితి ఉండేది కాదని అవేదన వ్యక్తం చేశారు. ఇటు హైదరాబాద్ లో ఉత్పత్తి అయిన భారత్ బయోటెక్ వారి కోవాక్సిన్ ని ముందు రాష్ట్ర ప్రజలకు అందిచడంలో రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం కూడా వైఫల్యం చెందిందన్నారు.

    దీని వల్ల ఈ రోజు వాక్సిన్ లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ప్యానల్ నుండి డాక్టర్ సహిద్ జమీర్ వై తొలగడినికి గల కారణాలపై ఆయన అవేదన వ్యక్తం చేశారు. వాక్సిన్ అందించడంలో వైఫల్యం చెందిన మోడీ ప్రభుత్వం పై ఢిల్లీలో కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ ఆందోళన చేస్తే మోడీ ప్రభుత్వం వారి పై కేసులు పెట్టడం పై ఉన్న శ్రద్ధ వాక్సిన్ అందించడంలో చూపిస్తే బాగుంటుందని వి.హెచ్ అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నట్లు వాక్సిన్ అందించడంలో వైఫల్యం అయిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెడ్డడం కాదని కావాలంటే తన పి (రాహుల్ గాంధీ) పై కేసులు పెట్టాలని అనడం రాహుల్ చిత్తశుద్ది కి, ప్రజపై ఆయన అంకిత భావం ఏమిటో తెలుస్తుందని అన్నారు.

    ఇక తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ లో ఈటెల రాజేందర్, అటు ఆంధ్రా ప్రదేశ్ లో ఎం.పి రఘురామ రాజు పై ముఖ్యమంత్రులు చూపుతున్న శ్రద్ధ కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చూపి, ఆ తరువాత ఈ వ్యవహారాలపై చూపాలని అన్నారు.
    Published by:Veera Babu
    First published: