హోమ్ /వార్తలు /తెలంగాణ /

వినాయక మండపాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

వినాయక మండపాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలు గణేష్‌ ఉత్సవాల నిర్వాహకులు పరిస్థితులను అవగాహన చేసుకుని ఇండ్లలోనే విగ్రహాలను ఏర్పాటుచేసి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించుకోవాలని మంత్రి తలసాని తెలిపారు.

మరికొద్ది రోజుల్లోనే వినాయక చవితి పండగ ఉన్న నేపథ్యంలో.. ఈ సారి వినాయక మండపాల అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై స్పష్టత వచ్చింది. కరోనా నేపధ్యంలో ఈ సంవత్సరం రాష్ట్ర ప్రజలు అందరూ గణేష్‌ ప్రతిమలను ఇండ్లలోనే ప్రతిష్టించుకుని పండగను సంప్రదాయబద్దంగా జరుపుకొని ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై హోంమంత్రి మహమూద్‌ అలీతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లతో పాటు జీహెచ్‌ఎంసి కమిషనర్‌, భాగ్యనగర్‌ గణేష్‌ఉత్సవ సమితి నాయకులు హాజరయ్యారు.

కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలు గణేష్‌ ఉత్సవాల నిర్వాహకులు పరిస్థితులను అవగాహన చేసుకుని ఇండ్లలోనే విగ్రహాలను ఏర్పాటుచేసి శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించుకోవాలని ఆయన తెలిపారు. దేవాదాయశాఖ పరిధిలోని అన్ని గణేష్‌ ఆలయాల్లో గణేష్‌ నవరాత్రులు పూర్తయ్యే వరకూ సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. అంతకుముందు హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ సైతం ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటించారు. ఇక ఇప్పటికే బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలాన్ని రద్దు చేయగా.. ఖైరతాబాద్ వినాయకుడిని అతి తక్కువ ఎత్తులో ఉండే విధంగా రూపుదిద్దుతున్నారు.

First published:

Tags: Ganesh Chaturthi 2020, Talasani Srinivas Yadav, Telangana

ఉత్తమ కథలు