CEC on Huzurabad : డబ్బు పంపిణి ఫిర్యాదు పై స్పందించిన సీఈసి, చర్యలు తీసుకోవాలని ఆదేశం

ప్రతీకాత్మక చిత్రం

EC on Huzurabad by elections : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. స్థానికంగా జరుగుతున్న పరిణామాలపై స్థానిక ఈసీ అధికారులను ప్రశ్నించింది. ఎక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Share this:
    హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ( Huzurabad by elections ) డబ్బు మద్యం ఏరులై పారుతుంది. ఈ క్రమంలోనే తమకు డబ్బులు ఇవ్వలేదని కొంత మంది ప్రజలు నేరుగా రోడ్డుమీదకు వచ్చి స్థానిక ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలో అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీల డబ్బు కవర్లు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వందల కోట్ల రూపాయల ఖర్చుతో ఎన్నికలు కొనసాగుతున్నాయని, ఓటర్లను డబ్బుతో ప్రలోభ పెడుతుండడం బహిరంగానే చర్చ కొనసాగుతోంది.

    కాగా ఈ పరిణామాలపై కాంగ్రేస్ ( congress ) పార్టీ నేరుగా కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ( Election commission ) ఫిర్యాదు చేసింది. ఎన్నికల్లో విపరీతమైన డబ్బు ,మద్యం ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్రం నుండి వచ్చిన కొంతమంది అధికారులు, స్థానిక ఎలక్షన్ అధికారులు సైతం అధికార టీఆర్ఎస్‌కు వత్తాసు పలుకుతున్నారని సీఈసికి చేసిన ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు రద్దు చేసి నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని ఫిర్యాదులో పేర్కోన్నారు.

    ఇది చదవండి : కుక్కలను చంపించినందుకు కమిషనర్‌పై వేటు.. పోలీసు కేసు నమోదు..


    దీంతో హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీకి సంబంధించి వస్తున్న ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందంచి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పరిశీలకులకు స్పష్టం చేసింది. పోలింగ్‌ ఏర్పాట్లపై ఈసీ దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్షలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ , పోలీసుశాఖ నోడల్‌ అధికారి జితేందర్‌, కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల పరిశీలకులు సమీక్షకు హాజరయ్యారు.

    ఇది చదవండి : బుటకపు ఎన్నికలు రద్దు చేయండి.. ఎన్నికల కమిషన్‌కు కాంగ్రేస్ ఫిర్యాదు..


    ఈ క్రమంలోనే పోలింగ్‌ ఏర్పాట్లపై సమీక్షించిన ఈసీ అధికారులు.. శాంతిభద్రతలు, కొవిడ్‌ నిబంధనల అమలుపై ఆరా తీశారు. పోలింగ్‌ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కమిషన్‌.. స్థానికేతరులు ఇంకా ఎక్కడైనా ఉంటే వెంటనే పంపించివేయాలని ఆదేశించింది. ఎలాంటి శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని, పోలింగ్‌ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈసీ అధికారులు తెలిపారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులు.. పరిశీలకులను ప్రశ్నించారు.

    దీంతో ఇప్పటివరకు హుజూరాబాద్‌లో ఇప్పటి వరకు రూ.3.52 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని సీఈవో వెల్లడించారు. ఎక్కడ ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు నివేదికలు పంపాలని ఈసీ స్పష్టం చేసింది.
    Published by:yveerash yveerash
    First published: