తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ లేఖ రాసింది. ఎమ్మెల్యేలకు ఎర కేసుకు సంబంధించి వివరాలు అందించాలని అందులో కోరింది. కొద్దిరోజుల క్రితం ఈ కేసును సీబీఐకు(CBI) అప్పగించింది హైకోర్టు. హైకోర్టు సర్టిఫైడ్ అర్డర్ కాపీ అందడంతో కేసు దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో కేసు వివరాలు అందించాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. మరోవైపు హైకోర్టులో(Telangana High Court) ఎమ్మెల్యేల కొనుగోలు కేసు(MLA Poaching Case) విచారణ రేపటికి వాయిదా పడింది. కేసును సిబిఐతో దర్యాప్తు చేయించాలన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. ప్రభుత్వం దాఖలు చేసిన ఆపిల్ రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు న్యాయమూర్తి ఈ కేసును వాయిదా వేశారు. ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలను కొనాలని చూశారని, అలాంటప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంలో తప్పు లేదని కోర్టుకు తెలిపారు. అనంతరం ప్రతివాదులు తరపు వాదనలు కొనసాగాయి. ఈ క్రమంలో హైకోర్టు ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
పది రోజుల క్రితం ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు సిట్ నుంచి సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ విచారణ సందర్భంగా సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఈ దశలో కేసును సీబీఐకి బదిలీ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో సిట్ పురోగతి సాధించిందని, అందుకే సిట్ తోనే దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బీజేపీ నేతల తరఫున రాంచందర్ రావు వాదనలు వినిపించారు. సిట్ దర్యాప్తులో సాంకేతిక అంశాలను విస్మరించారని ఆరోపించారు. రాజకీయ దురుద్దేశాలతోనే ఈ కేసు పెట్టారని, కేసుతో సంబంధంలేకపోయినా బీజేపీ పేరు ప్రస్తావించారని ఆయన కోర్టుకు విన్నవించారు.
Telangana BJP | తెలంగాణ బీజేపీ చీఫ్ పదవిగా ఈటల రాజేందర్.. క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి
Ponguleti Srinivas Reddy: పొంగులేటికి పొగ.. పొమ్మనలేకేనా? సంక్రాంతి తర్వాత కీలక నిర్ణయం.!
ఏకంగా ముఖ్యమంత్రి మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు చేశారని వివరించారు. అసలు ఈ కేసులో ఏసీబీకి తప్ప సిట్ కు విచారణ జరిపే అధికారంలేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం అడ్వొకేట్ జనరల్ వాదనలను తోసిపుచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు సిట్ ఏమేరకు దర్యాప్తు చేసిందో, ఆ వివరాలన్నీ సీబీఐకి అందజేయాలని ఆదేశించింది.సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును ఇప్పటిదాకా సిట్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే, సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదంటూ నిందితులతో పాటు, బీజేపీ నేతలు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించడంతో.. అక్కడ సర్కార్‌కు ఊరట లభిస్తుందా ? లేదా ? అన్నది ఉత్కంఠగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBI, Telangana, TRS MLAs Poaching Case