ఈరోజు ఉదయం నుండి సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavita)ను సీబీఐ విచారిస్తుందా లేదా అనే ఉత్కంఠకు తెర పడింది. సీబీఐ రిప్లై కోసం కవిత (MLC Kavita) ఉదయం నుండి వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కవిత లేఖకు సీబీఐ నుండి రిప్లై వచ్చింది. ఈనెల 11న ఉదయం 11 గంటలకు నివాసంలో భేటీకి సీబీఐ అంగీకరిస్తూ ఈ మెయిల్ చేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత (MLC Kavita)కు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్న కవిత (MLC Kavita)ను సిబిఐ హైదరాబాద్ లో ఎక్కడైనా హాజరవ్వొచ్చు అని పేర్కొంది. దీనిపై స్పందించిన కవిత (MLC Kavita) డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో విచారణకు సహకరిస్తా అని, కానీ కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీ ఇవ్వాలని ఆమె సీబీఐకి లేఖ రాసింది. ఈ క్రమంలో సీబీఐ సంబంధిత వెబ్ సైట్ లో కేసుకు సంబంధించిన FIR, ఫిర్యాదు కాపీని అందుబాటులో ఉంచింది. అనంతరం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో కవిత (MLC Kavita) భేటీ అయ్యారు. ఈ భేటీలో నెక్స్ట్ ఏం చేయాలి అనేదానిపై ప్రధాన చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఆ భేటీ అనంతరం సడన్ గా కవిత (MLC Kavita) మరోసారి సీబీకి లేఖ రాయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.
అయితే మొదటగా రాసిన లేఖలో డిసెంబర్ 6న కేసుకు సంబంధించి వివరణ ఇస్తానని పేర్కొంది. ఆ తరువాతి లేఖలో ఆమె ఇలా పేర్కొంది..కేసుకు సంబంధించి FIR, ఫిర్యాదు కాపీలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు చేసిన ఈ మెయిల్ ను స్వీకరించాను. అయితే అందులో విషయాలు, నిందితుల జాబితా, ఫిర్యాదులోని అంశాలను క్షుణ్ణంగా గమనించాను. కానీ ఎక్కడా కూడా తన పేరు అందులో ప్రస్తావనకు రాలేదని గుర్తు చేస్తున్నాను. ఇక మీరు ప్రతిపాదించినట్టు నేను డిసెంబర్ 6వ తేదీన నేను కలవలేను. ముందుగా ఖరారు అయిన షెడ్యూల్ కారణంగా నేను రేపు హాజరు కాలేను. అయితే ఈనెల 11, 12, 14,15 తేదీల్లో ఏది అనుకూలమో ఆ సమయంలో మిమ్మల్ని కలవగలను అని కవిత లేఖలో పేర్కొన్నారు. నేను చట్టాన్ని గౌరవిస్తా..దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా అని కవిత (MLC Kavita) పేర్కొన్నారు.
ఈ క్రమంలో కవిత లేఖపై సీబీఐ కాస్త లేటుగా స్పందించినప్పటికీ రిప్లై రావడంతో ఈ అంశానికి తెర పడింది. అయితే డిసెంబర్ 11న సీబీఐ అధికారులు కవితను విచారించనున్నారు. ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెల్లడవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi liquor Scam, Hyderabad, Kalvakuntla Kavitha, Telangana