హోమ్ /వార్తలు /తెలంగాణ /

BRS MLAs Poaching Case: సీఎం కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించే ఛాన్స్..మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు

BRS MLAs Poaching Case: సీఎం కేసీఆర్ ను సీబీఐ ప్రశ్నించే ఛాన్స్..మాజీ జేడీ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్, మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

సీఎం కేసీఆర్, మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యేలతో డీలింగ్ కోసం నందకుమార్, సింహయాజి, రామచంద్రభారతి మంతనాలు జరపగా పోలీసులు భగ్నం చేశారు. ఆ తరువాత ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం తాజాగా కేసు సీబీఐ చేతికి వెళ్లడంతో భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో సీబీఐ నెక్స్ట్ ఎవరిని ప్రశ్నించబోతున్నారు? ఎలాంటి విషయాలు బయటకొస్తాయనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇదిలా ఉంటే ఈ కేసులో ఏకంగా సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి సీబీఐ ప్రశ్నించబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో సీబీఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

చట్టం ముందు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరైనా ఒకటే. ఒకవేళ సీఎం కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి సీబీఐ విచారించే అవకాశం ఉందని లక్ష్మీ నారాయణ అన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. సీబీఐకి అనుమానం ఉంటే కేసీఆర్ ను కూడా ప్రశ్నించే అవకాశం లేకపోలేదని సీబీఐ మాజీ జెడి లక్ష్మీ నారాయణ అభిప్రాయపడ్డారు. చట్టానికి లోబడి ఎవరైనా విచారణకు రావాల్సి ఉంటుందని అన్నారు. అయితే రానున్న రోజుల్లో సీబీఐ ఈ కేసును మొదటి నుంచి దర్యాప్తు చేయనుందని సమాచారం. ఈ కేసుకు సంబంధించి నిందితులు, నలుగురు ఎమ్మెల్యేలు సహా అనుమానం వున్న అందరిని సీబీఐ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి సిబిఐ ఆ దృష్టిలో విచారణ కొనసాగిస్తుందో లేదో చూడాలి.

కాగా ఇటీవల తెలంగాణ హైకోర్టు ఈ కేసుకు సంబంధించి కీలక తీర్పునిచ్చింది. ఇప్పటివరకు దర్యాప్తు చేసిన సిట్ ను రద్దు చేస్తూ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ సమయంలో కీలక విషయాలు వెల్లడించింది. సిట్ దర్యాప్తు విషయాలు బయటకు ఎలా వచ్చాయి. కేసుకు సంబంధించి ఆధారాలైన వీడియోలు సీఎంకు ఎవరిచ్చారని కోర్టు ప్రశ్నించింది. సిట్ దర్యాప్తు సరిగా జరగలేదు. అందుకే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు న్యాయస్థానం పేర్కొంది.

ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి గతంలో సీఎం కేసీఆర్ డీల్ కు సంబంధించిన వీడియోలను బయటపెట్టారు. అంతేకాదు ఆ వీడియోలను రాష్ట్రంలోని అన్ని హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు పంపించారు. అయితే సీఎం కేసీఆర్ స్వయంగా వీడియోలు బయటపెట్టడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశం అయింది. మరి ఈ కేసులో ఆధారాలు బయటపెట్టిన కేసీఆర్ ను సీబీఐ విచారిస్తుందో లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్సే.

First published:

Tags: CBI, CM KCR, Hyderabad, Kcr, Telangana, TRS MLAs Poaching Case

ఉత్తమ కథలు