Home /News /telangana /

CASH FOR REMOVING GOLD FROM CORONA DEAD BODY VRY

corona : కరోనా మృత దేహంపై బంగారం..శవం వద్దకు రాని కుటుంబ సభ్యులు..మరి బంగారం ఎలా తీసుకున్నారు..?

కరోనా మృత దేహంపై బంగారం..శవం వద్దకు రాని కుటుంబ సభ్యులు..

కరోనా మృత దేహంపై బంగారం..శవం వద్దకు రాని కుటుంబ సభ్యులు..

corona dead body : కరోనాతో ఓ మహిళ చనిపోయింది. అయితే ఆ మహిళపై ఒంటిపై లక్షల రూపాయల విలువ చేసే బంగారు అభరణాలు ఉన్నాయి. మరి కరోనాతో చనిపోయిన వ్యక్తి వద్దకే పోని పరిస్థితుల్లో ఆ బంగారాన్ని కుటుంబ సభ్యులు ఎలా పొందారు..బంగారు సోమ్ముల కోసం ఏం చేశారు..?

ఇంకా చదవండి ...
కరోనా కాలంలో మానవ సంబంధాలు అనే ఓ పుస్తకం రాస్తే అందులో ఈ స్టోరీ పెట్టాల్సి వస్తుంది. కరోనా తెచ్చిన కష్టాలు అన్నిఇన్ని కావు, మానవ సంబంధాలకు ఉన్న ఆర్థాన్నే మార్చేశాయి. నువ్వు, మనం, మన కుటుంబం అనే మాటలకు అర్థాలే మారిపోయాయి. కేవలం నేను, నా కుటుంబం అనే సూత్రంతోనే ప్రస్తుతం కరోనా కాలాన్ని గట్టేక్కిస్తున్నారు. ఇందులో అతికొద్దిమందిని మినాహయిస్తే..మెజారిటి ప్రజల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ఇలాంటీ దయనీయ పరిస్థితుల్లో కరోనా సోకిన వ్యక్తికి సపర్యలు చేయాలన్న ముందుకు రాని పరిస్థితి నెలకొంది. కనీసం కుటుంబ సభ్యులు కూడ కరోనా పేషంట్‌ వద్దకు దరి చేరడం లేదు..ఏదైనా డబ్బుతోనే సాదిస్తున్నారు.ఇక కరోనా సోకితేనే..ఇలా ఉంటే..ఆ వ్యాధితో చనిపోతే అంతే సంగతులు ..కనీసం చివరి చూపులు కూడ చూడకుండా ఆసుపత్రి నుండే నేరుగా స్మశాన వాటికలకు తరలిపోతున్నాయి. అది కూడ కొంతమందికి డబ్బులు చెల్లించి అంత్యక్రియలు చేసిన సంఘటనలు ఇప్పటికి కొనసాగుతున్నాయి

అయితే కరోనా సెకండ్ వేవ్ మరణాల్లో కాస్త ఊరట కల్గింది. శవాలను ఇతరులే దహన సంస్కరాలు చేస్తున్నా..కుటుంబ సభ్యులు మాత్రం తూతూ మంత్రంగా పాల్గోంటున్నారు. ఇలాంటీ సంధర్భంలోనే ఓ విచిత్ర సంఘటన మేడ్చల్ మల్కజ్‌గిరి జిల్లాలోని కీసర మండలంలో చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయిన శవాన్ని ముట్టుకోవాడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాలేదు. కాని ఆ శవంపై ఉన్న బంగారానికి మాత్రం ముందుకు వచ్చారు. అయితే ఓవైపు కరోనా భయం మరోవైపు బంగారంపై మోజు , ఆ కుటుంబసభ్యులను సతమతం చేశాయి.

దీంతో కుటుంబ సభ్యులు ఎవరు మృత దేహం వద్దకు వెళ్లకుండా ప్లాన్ వేశారు. బంగారం తీసి ఇచ్చిన వారికి డబ్బులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దీంతో శవంపై ఉన్న బంగారాన్ని తీసి ఇస్తే..పద్నాలుగు వేలు ఇస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే స్థానిక వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక కరోనా భయం లేని ఓ స్థానిక వ్యక్తి మృతదేహంపై ఉన్న లక్ష రూపాయల బంగారాన్ని తీసి ఇచ్చి 14 వేల రూపాయలను తీసుకు వెళ్లాడు. దీంతో ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏది ఏమైనా మావన సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే అనే ఓ తత్త్వవేత్త అనే మాటలను ఇక్కడ గుర్తుకు తెచ్చుకోక తప్పదు.
Published by:yveerash yveerash
First published:

Tags: Corona, Corona dead bodies, Gold, Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు