హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ys Sharmila: వైఎస్ షర్మిలపై కేసు నమోదు..జైలుకు తరలించే అవకాశం?

Ys Sharmila: వైఎస్ షర్మిలపై కేసు నమోదు..జైలుకు తరలించే అవకాశం?

వైఎస్ షర్మిల

వైఎస్ షర్మిల

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys sharmila)ను సినిమా సీన్ ను తలపించేలా అరెస్ట్ చేశారు. ప్రతీ క్షణం నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఆమె కారులో ఉండగానే క్రేన్ సాయంతో SR నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడ కూడా హైడ్రామా నెలకొంది. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆమె కారు డోర్ తీయకుండా అలాగే ఉండిపోయింది. దీనితో పోలీసులు కష్టతరం మీద లాఠీ సహాయంతో డోర్ అన్ లాక్ చేశారు. అనంతరం కారులో ఉన్న అందరిని అరెస్ట్ చేశారు. మహిళా పోలీసులు షర్మిలను స్టేషన్ లోపలికి తరలించారు. అనంతరం షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు, విధుల్లో ఉన్న అధికారులకు విఘాతం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్లు 333, 337, 353 కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వైఎస్ విజయమ్మ SR నగర్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమెను రిమాండ్ కు తరలిస్తారా లేక బెయిల్ ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (Ys sharmila)ను సినిమా సీన్ ను తలపించేలా అరెస్ట్ చేశారు. ప్రతీ క్షణం నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఆమె కారులో ఉండగానే క్రేన్ సాయంతో SR నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం అక్కడ కూడా హైడ్రామా నెలకొంది. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఆమె కారు డోర్ తీయకుండా అలాగే ఉండిపోయింది. దీనితో పోలీసులు కష్టతరం మీద లాఠీ సహాయంతో డోర్ అన్ లాక్ చేశారు. అనంతరం కారులో ఉన్న అందరిని అరెస్ట్ చేశారు. మహిళా పోలీసులు షర్మిలను  (Ys Sharmila) స్టేషన్ లోపలికి తరలించారు. అనంతరం షర్మిలపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగించినందుకు, విధుల్లో ఉన్న అధికారులకు విఘాతం కలిగించినందుకు షర్మిలపై  (Ys Sharmila) ఐపీసీ సెక్షన్లు 333, 337, 353 కింద కేసు నమోదు చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వైఎస్ విజయమ్మ  (YsVijayamma) SR నగర్ పోలీస్ స్టేషన్ కు బయలుదేరినట్లు తెలుస్తుంది. మరి షర్మిలను జైలుకు తరలిస్తారా లేక బెయిల్ ఇస్తారా అనేది సస్పెన్స్ గా మారింది. మరికొద్ది సేపట్లో దీనిపై క్లారిటీ రానుంది.

Mulugu: మిస్టర్ తెలంగాణ టైటిల్ కైవసం చేసుకున్న సింగరేణి యువకుడు

లోటస్ పాండ్ లో విజయమ్మ హౌస్ అరెస్ట్..

వైఎస్ షర్మిల (Ys Sharmila) అరెస్ట్ విషయం తెలుసుకున్న వైఎస్ విజయమ్మ  (YsVijayamma) లోటస్ పాండ్ నుండి SR నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు విజయమ్మ (YsVijayamma) ను పోలీసులు అడ్డుకున్నారు. దీనితో విజయమ్మ  (YsVijayamma) పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసుల తీరుతో విజయమ్మ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. కాగా వైఎస్ విజయమ్మ  (YsVijayamma) నిన్నటి నుండి హౌస్ అరెస్ట్ లో ఉన్న విషయం తెలిసిందే.

Bhadradri Kothagudem: పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు .. కారణం ఏమిటంటే..?

కార్యకర్తలను చెదరగొడుతున్న పోలీసులు..

ప్రస్తుతం షర్మిల ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పీఎస్ కు తరలివస్తున్నారు. స్టేషన్ కు ఇరువైపులా పోలీసులు వారిని చెదరగొడుతున్నారు. పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పారు. అలాగే షర్మిల అనుచరులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు వచ్చే మార్గాలను మూసేశారు.

ఇక పోలీసుల తీరుపై షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా రౌడీల్లాగా మారారు. BRS అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి అని షర్మిల ఎద్దేవా చేశారు.

First published:

Tags: Hyderabad, Telangana, Telangana News, YS Sharmila, YS Vijayamma

ఉత్తమ కథలు