షాకింగ్ వీడియో.. హైదరాబాద్‌లో పాల కల్తీ.. ఇది చూస్తే పాలే తాగరు

పాలను కల్తీ చేస్తున్న సోహైల్

బకెట్‌లో పాలు పిండిన సోహైల్.. ఓ గిన్నెలో కొన్ని పాలను తీసుకొని సగం వరకు తాగాడు. ఎంగిలి చేసిన మిగిలిన పాలను మళ్లీ అదే బకెట్‌లో పోశాడు.

  • Share this:
    రోజూ పాలు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలు, పెద్దలందరూ ఏదో ఒక రూపంలో నిత్యం పాలు తీసుకుంటారు. ఈ పాలతో వేడి వేడి టీ తాగనిదే చాలా మందికి రోజు ప్రారంభం కాదు. అలాంటి పాలు కల్తీ అవుతున్నాయి. సాధారణంగా నీళ్లు కలుపుతూ చిక్కని పాలను కల్తీ చేస్తుంటారు. ఐతే ఇతడు చేసిన పనిచూస్తే మాత్రం ఇక జీవితంలో పాలు తాగాలనిపించదు. అంత దారుణంగా పాలను కల్తీ చేశాడు. హైదరాబాద్‌లోని డబీర్‌పురాకు చెందిన మహమ్మద్ సోహైల్ డైరీ ఫామ్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల తన డైరీలో ఓ గేదె నుంచి సోహైల్ పాలు పిండిన వీడియో వైరల్‌గా మారింది. పాలరు ఎంగిలి చేయడంతో పాటు గేదెలు తాగే నీటిని అందులో కలిపి మరింత కల్తీ చేశాడు.

    బకెట్‌లో పాలు పిండిన సోహైల్.. ఓ గిన్నెలో కొన్ని పాలను తీసుకొని సగం వరకు తాగాడు. ఎంగిలి చేసిన మిగిలిన పాలను మళ్లీ అదే బకెట్‌లో పోశాడు. మనోడు అంతటితో ఆగలేదు. కొట్టంలో గేదెల కోసం ఏర్పాటు చేసిన తొట్టి నుంచి నీటిని తీసి అదే బకెట్‌లో పోశాడు. ఆ నీళ్లు ఎంతో అపరిశుభ్రంగా ఉన్నాయి. చెత్తా చెదారంతో నిండిపోయింది. ఆ నీళ్లనే పాలల్లో కలిపేశాడు సోహైల్. అతడు చేసిన పనిని కొందరు యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై డబీర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: