కాచిగూడ రైలు ప్రమాదం.. లోకోపైలట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదు..
నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. చంద్రశేఖర్ కోలుకున్న తర్వాత పోలీసులు ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు.
news18-telugu
Updated: November 13, 2019, 9:40 AM IST

కాచిగూడ స్టేషన్లో ప్రమాద దృశ్యం
- News18 Telugu
- Last Updated: November 13, 2019, 9:40 AM IST
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో రెండు రోజుల క్రితం హంద్రీ ఇంటర్‌సిటీని ఎంఎంటీఎస్ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టిన సంగతి తెలిసిందే. స్టేషన్లో సిగ్నల్‌ను గమనించుకుండా వెళ్లి ప్రమాదానికి కారణమైనందుకు ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్‌పై కేసు నమోదైంది. ఆర్పీఎఫ్,స్టేషన్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. నాంపల్లిలోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగానే ఉంది. చంద్రశేఖర్ కోలుకున్న తర్వాత పోలీసులు ఆయన వాంగ్మూలం తీసుకోనున్నారు.
కాగా, జరిగిన ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే మంగళవారం మధ్యాహ్నానికి పునరుద్దరణ పనులు ముగియడంతో అన్ని రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి.
కాగా, జరిగిన ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రమాదం కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే మంగళవారం మధ్యాహ్నానికి పునరుద్దరణ పనులు ముగియడంతో అన్ని రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి.
జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్‌స్టేషన్‌గా చొప్పదండి
పోలీసులను గన్‌తో కాల్చబోయారు.. సజ్జనార్ ప్రెస్‌మీట్..
‘దిశ’ హీరో వీసీ సజ్జనార్ ట్రాక్ రికార్డు ఇదీ..
ఉప్పల్‌లో నేడు టీ20 మ్యాచ్.. అర్ధరాత్రి 1 వరకు మెట్రో రైళ్లు
దిశ హత్య కేసులో మరో కీలక ఆధారం లభ్యం.. పాతిపెట్టిన దాన్ని బయటకు తీసి...
దిశ కేసు విచారణకు 50 మంది పోలీసులు...
Loading...